relese
-
‘పాలమూరు’ పునర్నిర్మాణానికి రూ.10 వేల కోట్లతో ప్రణాళికలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘కాంగ్రెస్ ఎప్పు డైనా విధానాలకు కట్టుబడి, లక్ష్యసాధన కోసం పనిచేసే పార్టీ. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి మూడు నెలల్లోనే పాలమూరు పునర్నిర్మాణం కోసం రూ.10 వేల కోట్లకుపైగా వెచ్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నారాయణపేట–కొడంగల్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల, ప్రతిష్టా త్మక విద్య, వైద్య సంస్థల ఏర్పాటు, రోడ్లు, మౌలిక సదుపాయాల నిర్మాణం ఇలా ప్రతి రంగంలోనూ అభివృద్ధి పనులతో పాటు పథకాల అమలులో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు’ అని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ హస్తం అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధి ష్టానం వివిధ రాష్ట్రాలకు సంబంధించి శుక్రవారం తొలివిడతగా 39 మంది ఎంపీ అభ్యర్థుల జాబితా ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకు శనివారం కాంగ్రెస్ నాయకత్వానికి వంశీచంద్‌రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ.. మహబూబ్‌నగ ర్కు కాంగ్రెస్ గ్యారంటీ పేరిట లేఖ విడుదల చేశారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ నక్కజిత్తులతో పాలమూ రు మోసపోయింది.. ఇదే కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణనే కాదు, మహ బూబ్నగర్నూ పట్టించుకున్న సందర్భం లేదు. ఆ పదేళ్ల నష్టాన్ని పూడుస్తూ, భవిష్యత్ వైపు నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థమైన విధానంతో అడుగులు వేస్తోందని తెలిపారు. అందుకే అడుగడు గునా ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్నా రని చల్లా పేర్కొన్నారు. పాలమూరు న్యాయయా త్రలో జనం గుండె చప్పుడు విన్నానని.. కరువు లేని మహబూబ్‌నగర్ ఆకాంక్షకు అనుగుణంగా జనం కోసం.. జలం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు నిర్మించి, జలకళ తెచ్చి, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతానని, అందరూ తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. -
మీకు రూ.75 కాయిన్ కావాలా అయితే సింపుల్ గా ఇలాచేయండి..!
-
పండుగల సీజన్లో ఎస్‌యూవీల సందడే సందడి!
న్యూఢిల్లీ: రానున్న పండుగల సీజన్ బహుళ ప్రయోజాలతో కూడిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీలు) పెద్ద ఎత్తున ఆవిష్కరణకు సాక్ష్యంగా నిలవనుంది. సుమారు డజను ఎస్యూవీ మోడళ్లను కంపెనీలు విడుదల చేయనున్నాయి. వీటి ధరలు రూ.5.5 లక్షల నుంచి రూ.65 లక్షల మధ్య ఉండనున్నాయి. మిగతా సంవత్సరాలకు ఈ ఏడాది భిన్నంగా ఉండనుంది. ఎందుకంటే కంపెనీలు సాధారణంగా ఏడాదిలో వివిధ సందర్భాల్లో కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తుంటాయి. కానీ, ఈ విడత రానున్న పండుగల సీజన్‌ను ఆవిష్కరణలకు లక్ష్యంగా పెట్టుకోవడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2020–21లో ఎనిమిది కొత్త కార్లు విడుదల కాగా.. వీటి ఆవిష్కరణలు ఏడాది వ్యాప్తంగా కొనసాగాయి. 2021–22లో ఏడు కొత్త మోడళ్లు విడుదలయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లోనూ కొత్త కార్ల ఆవిష్కరణలు ఐదు లేదా ఆరు స్థాయిలో ఉన్నాయి. కానీ, ఈ ఏడాది మాత్రం పదికి పైగా కొత్త ఎస్‌యూవీలు వినియోగదారులను పలకరించనున్నాయి. దేవీ నవరాత్రులతో పండుగల సందడి తారా స్థాయికి చేరి, దీపావళితో ముగుస్తుంటుంది. ఆటో కంపెనీలకు ఈ పీరియడ్ చాలా కీలకమైనది. ఏడాదిలో నమోదయ్యే విక్రయాల్లో 20% ఈ 3 నెలల కాలంలోనే నమోదవుతుంటాయి. కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకురావడం అసాధారమేమీ కాదు. కానీ, ఈ ఏడాది పండుగల సీజన్ సందర్భంగా ఎక్కువ సంఖ్యలో ఎస్‌యూవీలు (ఒకే తరహా బాడీతో కూడినవి) ఆవిష్కరణ చేస్తుండడమే ప్రత్యేకం. ముందుగా మారుతీ.. మొదటిగా మారుతీ సుజుకీ నుంచి కొత్త జెనరేషన్ బ్రెజ్జా ఆవిష్కరణ ఉండనుంది.గత సోమవారం మారుతి సుజుకీ ఇందుకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించడంతోపాటు, బుకింగ్‌లు తీసుకోవడాన్ని ప్రారంభించింది. జూన్ 30న విడుదల కానుంది. మిడ్‌సైజు ఎస్యూవీ అయిన టయోటా హైరైడర్ జూలై 1న మార్కెట్లోకి రానుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌కు పోటీనివ్వనుంది. టయోటా అర్బన్ క్రూయిజర్ (బ్రెజాకు రీబ్రాండింగ్)ను కూడా ఆవిష్కరించనుంది. -
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 16 రాష్ట్రాల్లో వచ్చే ఏప్రిల్ నాటికి ఖాళీ అవుతున్న 58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 5 న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి12 వరకు నామినేషన్లను అనుమతిస్తారు. అలాగే మార్చి 13న స్క్రూటినీ నిర్వహిస్తారు. నామినేషన్లు విత్‌డ్రా చేసుకునే వారికి మార్చి 15 వరకు అవకాశం ఇస్తారు. మార్చి 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కించి ఫలితాలు విడుదల చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ 3, బిహార్ 6, చత్తీస్గడ్ 1, గుజరాత్ 4, హర్యానా 1, హిమాచల్ ప్రదేశ్ 1, కర్నాటక 4, మధ్యప్రదేశ్ 5, మహారాష్ట్ర 6, తెలంగాణ 3, ఉత్తర్ ప్రదేశ్ 10, ఉత్తరాఖండ్ 1, పశ్చిమ బెంగాల్ 5, ఒడిశా 3, రాజస్తాన్ 3, జార్ఖండ్ నుంచి 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఖాళీ అన్ని స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ నుంచి చిరంజీవి, రేణుకా చౌదరీ, దేవేందర్ గౌడ్లు, తెలంగాణ నుంచి సీఎం రమేష్ , రాపోలు ఆనంద భాస్కర్, పాల్వాయి గోవర్దన్ రెడ్డి(ఇది వరకే చనిపోయారు)ల పదవీ కాలం ఏప్రిల్‌లో ముగియనుంది. పోలింగ్‌లో పాల్గొనే ఓటర్లు రిటర్నింగ్ ఆఫీసర్ సూచించిన ఊదారంగు స్కెచ్ పెన్ను మాత్రమే వాడాలి. -
డోన్–బేతంచర్ల రోడ్డుకు రూ.27 కోట్లు విడుదల
కర్నూలు(టౌన్): డోన్-బేతంచర్ల రోడ్డుకు ప్రభుత్వం రూ.27 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం రహదారులు, భవనాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్యాంబాబు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తు జీఓ 584 జారీ చేశారు. 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డోన్–బేతంచర్ల రోడ్డు వెడల్పు, మరో లేయర్ రోడ్డు 7/8 నుండి కి.మీ 33/4 వరకు రహదారి పనులు చేపట్టేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. -
80 శాతం సాగు పూర్తి
త్వరలోనే రుణమాఫీ నిధుల విడుదల జేడీఏ విజయ్‌కుమార్ వెల్లడి సుభాష్‌నగర్ : జిల్లాలో 80 శాతం పంటల సాగు పూర్తయిందని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు ఎం.విజయ్‌కుమార్ తెలిపారు. అన్ని పంటలు కలిపి 3,23,170 హెక్టార్లలో సాగు నిర్దేశించగా, అందులో ఇప్పటికే 2,48,038 హెక్టార్లలో (80 శాతం) సాగు పూర్తయ్యిందని చెప్పారు. వరిసాగు మాత్రం 40 శాతమే పూర్తయిందన్నారు. రుణమాఫీ నిధుల్లో ఇప్పటికే 12.5 శాతం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. మరో పది రోజుల్లో 12.5 శాతం నిధులు విడుదల చేయనుందన్నారు. బుధవారం వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈసారి సంవృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని, ఎస్సారెస్పీలో ఇప్పటికే 45 టీఎంసీల నీరు వచ్చి చేరిందన్నారు. జిల్లాలో 40 శాతం వరినాట్లు పూర్తయ్యాయని, ఆగస్టు 15 లోగా మిగతా 60 శాతం పూర్తవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు.వర్షాలు ఆలస్యంగా కురుస్తున్నందున ఇప్పటికైనా నార్లు పోసుకోవచ్చని చెప్పారు. ఒకవేళ నాటు ఆలస్యమైతే నారు మొక్కలు ఎక్కువగా నాటుకోవాలని, ఎరువుల మోతాదు సైతం రెట్టింపుగా వాడుకోవాలని తెలిపారు. తద్వారా సరైన సమయానికి వేసిన దిగుబడే ఇప్పుడూ వస్తుందన్నారు. రుణమాఫీలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతో ప్రతి బ్యాంకుకు ఒక వ్యవసాయాధికారిని పర్యవేక్షణ కోసం నియమించామన్నారు. రైతుల కోసం 30 వేల టన్నుల యూరియా, 45 వేల టన్నుల కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులో ఉంచామన్నారు. రైతులకు ఏమైనా సందేహాలుంటే వ్యవసాయాధికారులను సంప్రదించాలని సూచించారు. -
మైక్రోసాఫ్ట్ విండోస్ 10 లూమియా ఫోన్లు
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ తాజాగా లూమియా సిరీస్‌లోనే విండోస్ 10 ఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేసే ‘లూమియా 950’, ‘లూమియా 950 ఎక్స్ఎల్’ అనే రెండు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా రూ.43,699గా, రూ.49,399గా ఉన్నాయి. ‘లూమియా 950’ హ్యాండ్‌సెట్‌లో 5.2 అంగుళాల తెర, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక 5.7 అంగుళాల తెర, 3,340 ఎంఏహెచ్ బ్యాటరీ, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ‘లూమియా 950 ఎక్స్ఎల్’ విండోస్ ఫోన్ సొంతం. కంపెనీ రెండు విండోస్ ఫోన్లలోనూ 20 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా లను పొందుపరిచింది. ఈ కొత్త విండోస్ 10 స్మార్ట్ఫోన్ల ప్రి-బుకింగ్ ఇప్పటికే ప్రారంభమయ్యిందని, క్రోమా రిటైల్ చైన్స్‌లో, మైక్రోసాఫ్ట్ ప్రియారిటీ రీసెల్లర్స్ వద్ద, అమెజాన్.ఇన్‌లోని మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో, రిలయన్స్, సంగీత రిటైల్ స్టోర్లలో కొత్త లూమియా హ్యాండ్సెట్లను ప్రి-బుకింగ్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ ఇండియా జీఎం అజయ్ మెహతా తెలిపారు.