ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 16 రాష్ట్రాల్లో వచ్చే ఏప్రిల్ నాటికి ఖాళీ అవుతున్న 58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 5 న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి12 వరకు నామినేషన్లను అనుమతిస్తారు. అలాగే మార్చి 13న స్క్రూటినీ నిర్వహిస్తారు. నామినేషన్లు విత్‌డ్రా చేసుకునే వారికి మార్చి 15 వరకు అవకాశం ఇస్తారు. మార్చి 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కించి ఫలితాలు విడుదల చేస్తారు.
ఆంధ్ర ప్రదేశ్ 3, బిహార్ 6, చత్తీస్‌గడ్ 1, గుజరాత్ 4, హర్యానా 1, హిమాచల్ ప్రదేశ్ 1, కర్నాటక 4, మధ్యప్రదేశ్ 5, మహారాష్ట్ర 6, తెలంగాణ 3, ఉత్తర్ ప్రదేశ్ 10, ఉత్తరాఖండ్ 1, పశ్చిమ బెంగాల్ 5, ఒడిశా 3, రాజస్తాన్ 3, జార్ఖండ్ నుంచి 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఖాళీ అన్ని స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ నుంచి చిరంజీవి, రేణుకా చౌదరీ, దేవేందర్ గౌడ్‌లు, తెలంగాణ నుంచి సీఎం రమేష్ , రాపోలు ఆనంద భాస్కర్, పాల్వాయి గోవర్దన్ రెడ్డి(ఇది వరకే చనిపోయారు)ల పదవీ కాలం ఏప్రిల్‌లో ముగియనుంది. పోలింగ్‌లో పాల్గొనే ఓటర్లు రిటర్నింగ్ ఆఫీసర్ సూచించిన ఊదారంగు స్కెచ్ పెన్‌ను మాత్రమే వాడాలి.
Comments
Please login to add a commentAdd a comment