మైక్రోసాఫ్ట్ విండోస్ 10 లూమియా ఫోన్లు | Microsoft Windows 10, Lumia phones relese | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్ విండోస్ 10 లూమియా ఫోన్లు

Published Tue, Dec 1 2015 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM

మైక్రోసాఫ్ట్ విండోస్ 10 లూమియా ఫోన్లు

మైక్రోసాఫ్ట్ విండోస్ 10 లూమియా ఫోన్లు

న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ తాజాగా లూమియా సిరీస్‌లోనే విండోస్ 10 ఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేసే ‘లూమియా 950’, ‘లూమియా 950 ఎక్స్‌ఎల్’ అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా రూ.43,699గా, రూ.49,399గా ఉన్నాయి. ‘లూమియా 950’ హ్యాండ్‌సెట్‌లో 5.2 అంగుళాల తెర, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక 5.7 అంగుళాల తెర, 3,340 ఎంఏహెచ్ బ్యాటరీ, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ‘లూమియా 950 ఎక్స్‌ఎల్’ విండోస్ ఫోన్ సొంతం.
 
  కంపెనీ రెండు విండోస్ ఫోన్లలోనూ 20 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా లను పొందుపరిచింది. ఈ కొత్త విండోస్ 10 స్మార్ట్‌ఫోన్ల ప్రి-బుకింగ్ ఇప్పటికే ప్రారంభమయ్యిందని, క్రోమా రిటైల్ చైన్స్‌లో, మైక్రోసాఫ్ట్ ప్రియారిటీ రీసెల్లర్స్ వద్ద, అమెజాన్.ఇన్‌లోని మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో, రిలయన్స్, సంగీత రిటైల్ స్టోర్లలో కొత్త లూమియా హ్యాండ్‌సెట్లను ప్రి-బుకింగ్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ ఇండియా జీఎం అజయ్ మెహతా తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement