Ajay Mehta
-
నోకియా–8 @ రూ.36,999
న్యూఢిల్లీ: నోకియా తనను తాను మళ్లీ నిరూపించుకోవాలనుకుంటోంది. పోయిన గత వైభవాన్ని దక్కించుకోవటానికి గట్టిగానే ప్రయత్నిస్తోంది. అనతికాలంలోనే ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ దిగ్గజాల సరసకు చేరాలని వడివడిగా అడుగులేస్తోంది. వచ్చే 3–5 ఏళ్లలో దీన్ని సాధిస్తామని నోకియా బ్రాండింగ్ హక్కులను చేజిక్కించుకున్న హెచ్ఎండీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ (ఇండియా) అజయ్ మెహతా ధీమా వ్యక్తంచేశారు. ఇటీవల మార్కెట్లోకి తీసుకువచ్చిన స్మార్ట్ఫోన్లకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారాయన. ‘బ్రాండ్, స్వచ్ఛమైన ఆండ్రాయిడ్, డిజైన్, నిజ జీవిత అనుభవాలు అనే నాలుగు స్తంభాలపై నోకియా నిలబడి ఉందని మేం విశ్వసిస్తున్నాం. ఇవే అస్త్రాలుగా ప్రత్యర్థులను ఎదుర్కొంటాం’ అన్నారాయన. మంగళవారమిక్కడ ‘నోకియా–8’ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మారుతున్న ట్రెండ్‌కు అనువుగా పరిగెత్తలేకపోవడం సహా డ్యూయెల్ సిమ్, టచ్‌స్క్రీన్ మొబైల్స్ వంటి వాటికి ప్రాధాన్యమివ్వకపోవడం వల్ల నోకియా మార్కెట్ వాటా తగ్గిపోయింది. 2012 చివరికి ఏకంగా 10 శాతంలోపునకు పడిపోయింది. ఇక ఒప్పొ, షావోమి వంటి చైనా కంపెనీల రాకతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. నోకియా–8 ప్రత్యేకతలు హెచ్ఎండీ గ్లోబల్ తాజాగా ‘నోకియా–8’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.36,999గా ఉంది. ఇందులో 5.3 అంగుళాల డిస్ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,090 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. ఈ ఫోన్లు అక్టోబర్ 14 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. వినియోగదారులు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన రిటైల్ స్టోర్లు సహా ఈ–కామర్స్ సంస్థ అమెజాన్.ఇన్‌లో నోకియా–8 స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. -
మైక్రోసాఫ్ట్ విండోస్ 10 లూమియా ఫోన్లు
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ తాజాగా లూమియా సిరీస్‌లోనే విండోస్ 10 ఓఎస్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేసే ‘లూమియా 950’, ‘లూమియా 950 ఎక్స్ఎల్’ అనే రెండు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా రూ.43,699గా, రూ.49,399గా ఉన్నాయి. ‘లూమియా 950’ హ్యాండ్‌సెట్‌లో 5.2 అంగుళాల తెర, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక 5.7 అంగుళాల తెర, 3,340 ఎంఏహెచ్ బ్యాటరీ, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ‘లూమియా 950 ఎక్స్ఎల్’ విండోస్ ఫోన్ సొంతం. కంపెనీ రెండు విండోస్ ఫోన్లలోనూ 20 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా లను పొందుపరిచింది. ఈ కొత్త విండోస్ 10 స్మార్ట్ఫోన్ల ప్రి-బుకింగ్ ఇప్పటికే ప్రారంభమయ్యిందని, క్రోమా రిటైల్ చైన్స్‌లో, మైక్రోసాఫ్ట్ ప్రియారిటీ రీసెల్లర్స్ వద్ద, అమెజాన్.ఇన్‌లోని మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో, రిలయన్స్, సంగీత రిటైల్ స్టోర్లలో కొత్త లూమియా హ్యాండ్సెట్లను ప్రి-బుకింగ్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ ఇండియా జీఎం అజయ్ మెహతా తెలిపారు.