హైదరాబాద్ నగరంలో కోల్‌కత్తాను సెట్స్ ద్వారా సృష్టిస్తున్నారు ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రబృందం. నాని హీరోగా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృతియాన్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. వెస్ట్ బెంగాల్ నేపథ్యంలో ఈ చిత్రకథాంశం ఉంటుంది. కరోనా ముందు ఈ చిత్రం మొత్తాన్ని కోల్‌కత్తాలో చిత్రీకరించాలనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో కీలక సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ మొత్తాన్ని హైదరాబాద్‌లోనే సెట్ వేసి షూట్ చేయనున్నారు. ఆల్రెడీ సెట్ వర్క్ పని జరుగుతోంది కూడా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్న ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయిక. మరో హీరోయిన్‌గా అదితీ రావ్ హైదరీ నటిస్తారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment