
Shyam Singha Roy Teaser: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’.రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ‘స్త్రీ ఎవ్వరికీ దాసి కాదు. ఆఖరికి దేవుడికి కూడా. ఖబడ్దార్’అంటూ శ్యామ్‌సింగారాయ్ పాత్రలో నాని చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి.
1970ల కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డిసెంబర్ 24న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.