Sai Pallavi Emotional Comments About Her Shyam Singha Roy Movie - Sakshi
Sakshi News home page

Shyam Singha Roy: అందుకే ఎమోషనల్‌ అయ్యా : సాయి పల్లవి

Published Tue, Dec 21 2021 6:13 PM | Last Updated on Wed, Dec 22 2021 4:22 PM

Sai Pallavi Talk About Shyam Singha Roy Movie - Sakshi

‘శ్యామ్ సింగ రాయ్‌ ప్రీ రిలీజ్  వేడుకలో కన్నీళ్లు కృతజ్ఞతతో వ‌చ్చాయి. అక్కడ అనురాగ్‌ కులకర్ణి పాట పాడారు. కొంతమంది డాన్స్‌ చేశారు. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో కళ ఉంది. మనకు ఏమీ రాకున్నా ఆ కళలను చూసి ఎంజాయ్‌ చేయగలుగుతున్నాం. అదే ఆ దేవుడు మనకు ఇచ్చిన పెద్ద ఆశీర్వాదం. అవన్నీ ఒక్కసారిగా గుర్తుకు వచ్చి ఎమోషనల్‌ అయిపోయా. మనం చేసే పని చుట్టూ ఉన్న వాళ్లకి సంతోషానిస్తే.. అంతకంటే అదృష్టం ఏముంటుంది. నాకు ఆ అవకాశాన్ని ఇచ్చిన దర్శకులు, నిర్మాతలకు రుణపడి ఉంటాను’అన్నారు నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి. నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లు. ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్  సాయి ప‌ల్ల‌వి మీడియాతో ముచ్చ‌టించింది. ఆ విశేషాలు.. 

అందుకే దేవదాసి క్యారెక్టర్‌ చేశా
ప్ర‌తి మూవీ నాకు న‌మ్మ‌కం క‌లిగాకే చేస్తాను. అలాగే స్క్రిప్ట్ చదివేటప్పుడు 'సినిమా ఇలా ఉంటుంది, నా పాత్ర అలా చేయొచ్చు' అని  ఒక‌ ఐడియా వస్తుంది. చిన్నప్పుడు మనం చరిత్ర చ‌దువుతున్న‌ప్పుడు ఈ క్యారెక్ట‌ర్ ఇలా ఉంటుంది అని ఊహించుకుని ఉంటాం. శ్యామ్ సింగరాయ్‌లో  స్క్రిప్ట్ చ‌దివేటప్పుడు దేవదాసి క్యారెక్ట‌ర్ ఎలా చేయాలి అనేదాని కంటే వాళ్ల సైకాలజీ ఎలా ఉంటుంది అని చెప్ప‌డం నచ్చింది. వేరే సినిమాల‌తో పోలిస్తే ఈ సినిమాను సైకాలజీ ప‌రంగా చేశాను. 

ఎంత కావాలో అంతే చూపించాం
దేవదాసి వ్యవస్థ గురించి పాఠశాలలో చదివా. దేవదాసీలు ప్రారంభంలో దేవుడికి సేవకులుగా ఉన్నారు. తర్వాత తర్వాత దాని అర్థమే మార్చేశారు. వాళ్ల గురించి ఈ సినిమాలో  పూర్తిగా చూపించ‌లేదు..  ఎంత కావాలో అంతే తీసుకున్నాం. 'శ్యామ్ సింగ రాయ్' పాత్రతో పాటు దేవ‌దాసి పాత్ర‌ ఎంత చూపించాలో, అంతే చూపించారు. ఇది పూర్తిగా దేవదాసి వ్యవస్థపై తీసిన సినిమా కాదు.

 క్లాసికల్ డాన్స్  రాదు
నేను డాన్స్ ఎక్కువ చేసింది 'లవ్ స్టోరీ'లోనే అనుకుంటా..ఈ సినిమాలో డాన్స్ ఎంత కావాలో... అంతే పెట్టారు. నాకు క్లాసికల్ డాన్స్ రాదు. ఇప్పటి వరకు నేర్చుకోలేదు. నేను చేయగలుగుతానని రాహుల్ నమ్మారు. నాతో పాటు పాటలో క్లాసికల్ డాన్స్ చేసిన వారు చాలా ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న‌వాళ్లు.  ఈ మూవీలో ఓ పాటకు డాన్స్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను. వాళ్లతో ఒకేలా చేశానని అంటే అదే పెద్ద సక్సెస్ అనుకున్నాను.

మామూలు సాయి పల్లవినే
నా బ్రెయిన్ లో నేను ఎప్పుడూ మామూలు సాయి పల్లవినే అనుకుంటా. అయితే...నేను చేసే సినిమాలు చాలామందికి సంతోషం ఇస్తుందంటే ఎమోషనల్ అయ్యాను.  నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలకు... ప్రేక్షకులు అందరికీ రుణపడి ఉంటాను

సాయి పల్లవి కనిపించదు
అన్ని మూవీస్‌కి క్యారెక్ట‌ర్‌కు క‌నెక్ట్ అయితేనే స్క్రీన్ మీద యాక్టింగ్ బావుంటుంది అనిపిస్తుంది. లేదంటే డిఫరెన్స్ తెలుస్తుంది.  శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాలో సాయి పల్లవి క‌నిపించ‌దు..దేవదాసి పాత్రే కనపడుతుంది.

అప్పుడూ, ఇప్పుడూ సేమ్ కంఫర్ట్
'ఎంసీఏ` టైమ్‌లో నాకు, నానిగారికి సన్నివేశాలు తక్కువ. సినిమాలో 20-30 ప‌ర్సెంట్ మాత్ర‌మే ఉంటాయి.  అందుక‌ని నేను ఎలా ఉంటానో...అందులో అలాగే ఉన్నాను. నానిగారు కూడా అంతే!  డిఫ‌రెంట్‌గా ఏమీ ట్రై చేయ‌లేదు. 'శ్యామ్ సింగ రాయ్'లో మా క్యారెక్టర్స్ వేరేలా ఉన్నాయి. మా ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఇంకా కొంచెం డీప్‌గా ఉన్నాయి. అప్పుడూ, ఇప్పుడూ సేమ్ కంఫర్ట్. ఈ క్యారెక్టర్స్ కోసం మా మధ్య ఎక్కువ డిస్కషన్స్ ఉన్నాయి.

మెడిటేషన్‌ చేయాలని ఉంది
నాకు ఎందులో ప్యాషన్ ఉంది అంటే నాకు నా గురించి తెలుసుకోవాలని ఉంటుంది. యాక్టింగ్, డాన్స్, మెడిసిన్ కాకుండా మెడిటేషన్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే... నా గురించి, పరిస్థితుల గురించి లోతుగా ఆలోచించాలని అనుకుంటున్నాను. నా గురించి నేను మ‌రింత తెలుసుకోవాలి అనుకుంటున్నా.

రాహుల్‌ని ఫోలో అయ్యాం అంతే..
రాహుల్ చాలా క్లారిటీతో సినిమా తీశారు. ఈ క‌థ‌కి ఏం కావాలి ఏం వ‌ద్దు అనేది ఆయ‌న‌కు పూర్తిగా తెలుసు.  నాని, నేను షూటింగ్ చేసిన ఫస్ట్ సీన్... సినిమాలో మా ఇద్దరి  క్యారెక్ట‌ర్స్ మ‌ధ్య  లాస్ట్ సీన్. ఎలా చేయాలో మాకు తెలియలేదు. తను ఇలా చేయండి అని చెప్పారు మేం ఆయ‌న్ని ఫాలో అయ్యాం అంతే... 

నచ్చితే వెబ్‌ సిరీస్‌ చేస్తా
'విరాట పర్వం` షూటింగ్ పూర్త‌య్యింది.. నా పాత్ర డ‌బ్బింగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. తమిళంలో ఓ సినిమా చేశా. అది కూడా త్వరలో విడుదల అవుతుంది. ప్ర‌స్తుతం వెబ్ కంటెంట్  చ‌దువుతున్నా...న‌చ్చితే త‌ప్ప‌కుండా చేస్తా

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement