
నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. కోల్‌కత్తా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బెంగాలీ కుర్రాడు వాసు పాత్రలో కనిపిస్తారు నాని. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం డిసెంబరు 24న థియేటర్లలో విడుదల కానుంది. ‘‘నాని, సాయి పల్లవిల మధ్య అద్భుతమైన ప్రేమకథను ఈ సినిమాలో చూస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది.
చదవండి:
అందుకే నాట్యంనేపథ్యంలో సినిమా తీశా! – రేవంత్
ప్రియుడిని పెళ్లాడిన సీరియల్ నటి.. ఫోటోలు వైరల్