Chiranjeevi: Megastar Watched Nani's Shyam Singha Roy Movie Pic Viral - Sakshi
Sakshi News home page

Shyam Singha Roy: నానితో కలిసి మీసం మెలేసిన చిరంజీవి.. ఫోటో వైరల్‌

Published Fri, Jan 21 2022 11:43 AM | Last Updated on Fri, Jan 21 2022 12:00 PM

Megastar Chiranjeevi Watched Shyam Singha Roy Movie - Sakshi

Chiranjeevi appreciates Nani for SSR: నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  'శ్యామ్‌ సింగరాయ్‌'. సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం గతేడాది క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 24న విడుదలై..  బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. ముఖ్యంగా నాని, సాయి పల్లవి నటనపై  విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్‌ చిరంజీవి వీక్షించారు. అనంతరం ‘శ్యామ్‌ సింగరాయ్‌’చిత్ర బృందాన్ని అభినందించారు.

దీనికి సంబంధించిన ఫోటోని నాని తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. తొలుత  ఈ ‘శ్యామ్’ ఎవరికి నచ్చాడో కనిపెట్టండి? అంటూ ట్వీట్ చేసిన నాని... ఆతర్వాత కొద్ది సేపటికే మెగాస్టార్ తో కలిసి దిగిన ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు .ఇందులో మెగాస్టార్, నేచురల్ స్టార్ ఇద్దరూ మీసం మెలేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా, ఇన్నాళ్లు థియేటర్లలో సందడి చేసిన శ్యామ్‌ సింగరాయ్‌.. ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీకి ఇచ్చాడు. నేటి(జనవరి 21)నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement