Shyam Singha Roy Movie Ranked 3rd Globally on Netflix OTT - Sakshi
Sakshi News home page

Shyam Singha Roy : అరుదైన రికార్డు నెలకొల్పిన శ్యామ్​ సింగరాయ్​

Published Thu, Jan 27 2022 3:19 PM | Last Updated on Thu, Jan 27 2022 4:29 PM

Shyam Singha Roy Movie Ranked 3rd Globally On Netflix OTT - Sakshi

నేచురల్​ స్టార్​ నాని హీరోగా ద్విపాత్రిభినయనం చేసి విజయం సాధించిన సినిమా శ్యామ్​ సింగరాయ్​. రాహుల్ సాంకృత్యాన్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్​ హీరోయిన్లుగా నటించారు. గతేడాది క్మిస్మస్ సందర్భంగా డిసెంబర్​ 24న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద మంచి విజయం సాధించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మంచి టాక్​ సంపాదించుకుంది. థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ జనవరి 21 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ అవుతోన్న సంగతి తెలిసిందే. 

తాజాగా శ్యామ్​ సింగరాయ్​ అరుదైన ఘనతను సాధించాడు. అత్యధికంగా వ్యూయింగ్​ అవర్స్​ను దక్కించుకుని ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రానికి దక్కని రికార్డును సొంతం చేసుకున్నాడు. నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ అయిన మొదటి 3 రోజుల్లోనే సుమారు 3,590,000  వ్యూయింగ్ అవర్స్​ను దక్కించుకుంది ఈ చిత్రం. ఆ వారంలో నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమ్​ అయిన సినిమాలు, వెబ్​ సిరీస్​ల్లో టాప్​ 3 స్థానంలో ఉండి టాప్​ 10 ప్లేస్​లో ఒకటిగా నిలిచింది. భారతీయ సినిమానే కాకుండా ఇప్పటివరకూ ఏ సౌత్​ సినిమా కూడా ఇలా మెప్పించలేకపోయింది. 

(చదవండి: థియేటర్‌ ముందు నాని 63 అడుగుల భారీ కటౌట్‌.. ఫొటోలు వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement