
‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చూసిన ప్రేక్షకులు ఎంతో సంతృప్తిగా ఫీలవుతారు. ఇలాంటి ఓ మంచి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది’ అని నాని అన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా వెంకట్ బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. సాయిపల్లవి, కృతీశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్. ఈ నెల 24న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వరంగల్‌లో జరిగిన వేడుకలో నాని మాట్లాడుతూ– ‘నాకు కల్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. మీరంటే ఇంకా ఇష్టం. ఇక్కడికి వస్తున్నామని చెప్పడంతో మంత్రి దయాకర్ గారు అంతా చూసుకున్నారు. ‘‘రెండేళ్ల తర్వాత థియేటర్లోకి వస్తున్నా.. ఈ సారి మాత్రం మిస్ అయ్యే చాన్సే లేదు. ఒక మంచి సినిమా చేశాక మనసులో ఓ గర్వం ఉంటుంది. మాకు ఇంచు కూడా భయం లేదు. శ్యామ్ సింగ రాయ్ సినిమాను చూసి ఎంతో సంతృప్తిగా ఫీలవుతారు. క్రిస్మస్ మాత్రం మనదే అని ఎంతో గర్వంగా చెబుతున్నాను.
రాహుల్‌లో టాప్ డైరెక్టర్ అయ్యే సత్తా ఉంది. వెంకట్‌గారితో ఎన్నో సినిమాలు చేయాలని ఉంది. సాయిపల్లవి డ్యాన్స్‌తో ప్రేమలో పడిపోతారు. కృతీశెట్టి భవిష్యత్‌లో మంచి స్థాయికి చేరుకుంటుంది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి చివరి పాటలతో ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం ఇంకా స్పెషల్‌గా మారింది. ఆయన ఆశీర్వాదాలు మాకు ఉంటాయి’ అన్నారు. ‘‘ఏ సినిమా అయినా వరంగల్ నుంచే మొదలుపెట్టండి.. హిట్ అవుతుంది’’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ‘‘ఈ చిత్ర దర్శక– నిర్మాతలు కొత్తవారైనా సినిమాను నాని తన భుజాలపై మోశారు’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు.
సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘శ్యామ్ సింగ రాయ్ ఓ విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ రెండు ప్రపంచాలను చూపించారు. వాసు, శ్యామ్ సింగ రాయ్ రెండు ప్రపంచాలని అద్బుతంగా చూపించారు. కెమెరామెన్, క్యాస్టూమ్ డిజైనర్ పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు థియేటర్లో చూడాల్సిందే. అన్ని సినిమాలను థియేటర్లోనే చూడండి. శ్యామ్ సింగ రాయ్ సినిమా నాని ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఇది వరకు ఎన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు.. సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాత గారు అనుకున్నారు’ అని అన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కృతి శెట్టి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో అందరి పర్ఫామెన్స్, విజువల్స్ ఇలా ప్రతీ ఒక్కటి అద్భుతంగా ఉంటాయి. మీరు కొత్త అనుభూతికి లోనవుతారు. థియేటర్లోనే సినిమాను చూడండి. అందరూ మాస్కులు ధరించండి. సురక్షితంగా ఉండండి. నాని గారంటే నాకు, నా ఫ్యామిలీకి చాలా ఇష్టం. నా రెండో సినిమానే ఆయనతో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. నిర్మాత వెంకట్ గారు ఎంతో స్వీట్ పర్సన్. రాహుల్ గారిది ఇదో రెండో సినిమా అని అనిపించలేదు. ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించారు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment