
నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. 1970ల కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డిసెంబర్ 24న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే విడుదలైన ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ సాంగ్ ప్రోమో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా శనివారం ఉదయం ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ఫుల్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు.‘శ్యామ్ సింగ రాయ్.. ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే.. వెనకబడని చైతన్యం వాడే’’ అంటూ ఈ సినిమాలో నాని పాత్ర స్వభావాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. మిక్కీ జే మేయర్ స్వారాలు అందించిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. విశాల్ దద్లాని, అనురాగ్ కులకర్ణి ఆలపించారు.
Comments
Please login to add a commentAdd a comment