నానికి అల్లు అర్జున్‌ బిగ్‌ షాక్‌.. ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌! | Pushpa Release Date Postponed Again Rumours Goes Viral | Sakshi
Sakshi News home page

నానికి అల్లు అర్జున్‌ బిగ్‌ షాక్‌.. ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌!

Nov 13 2021 11:23 AM | Updated on Nov 13 2021 11:50 AM

Pushpa Release Date Postponed Again Rumours Goes Viral - Sakshi

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఫిబ్రవరిలో జరిగే క్లాష్ గురించి. కాని డిసెంబర్ లోనే టాలీవుడ్ మరో ఇంట్రెస్టింగ్ క్లాష్ కు రెడీ అవుతోందట.

డిసెంబర్ 24న శ్యామ్ సింగ రాయ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నేచురల్ స్టార్ సోలోగా బరిలోకి దిగుతున్నాడని అందరూ అనుకుంటున్నారు. కాని నానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చేందుకు ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ రెడీ అవుతున్నాడని సమాచారం.ఇదే రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.డిసెంబర్ 17న రిలీజ్ ముహుర్తం ఫిక్స్ చేసుకుని పుష్పను ప్రమోట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. కాని ఇప్పుడు ఈ మూవీని డిసెంబర్ 25న విడుదల చేయాలనుకుంటున్నాడట.

నిజానికి మొదట డిసెంబర్ చివరి వారంలోనే పుష్ప ను రిలీజ్ చేయాలనుకున్నారు. కాని అల్లు ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూవారం ముందుగానే ఈ ప్యాన్ ఇండియా మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు దర్శకనిర్మాతలు.ఇఫ్పుడు రిలీజ్ డేట్ పై యూనిట్ మరోసారి యూటర్న్ తీసుకోవడానికి కారణం ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడమే అట. అదే నిజమైతే సౌత్ మొత్తం భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతున్న శ్యామ్ సింగ రాయ్ కు, పుష్ప బిగ్ షాక్ ఇచ్చినట్లు అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement