అల్లు అర్జున్ అరెస్ట్‌పై టాలీవుడ్ హీరో నాని స్పందించారు. సినిమా వ్యక్తులకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ అధికారులు, మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరుల పట్ల కూడా ఉండాలన్నారు. ఇలాంటి హృదయ విదారకమైన ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి వాటి నుంచి మనందరం నేర్చుకోవాలని.. మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి ఏ ఒక్కరూ బాధ్యులు కాదని.. ఇది మనందరి తప్పు అని నాని ట్వీట్ చేశారు.
పోలీసుల తీరు దారుణం: డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ
అల్లు అర్జున్‌ను శుక్రవారం అరెస్టు చేయడం చూస్తే ఉద్దేశపూర్వకంగానే ఉందని టాలీవుడ్ డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ అన్నారు. అల్లు అర్జున్ కావాలని తప్పు చేయలేదని.. ఈ రోజు అరెస్ట్ చేయడం సరైంది కాదని అన్నారు. బన్నీని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లొచ్చు.. కానీ బెడ్ రూమ్ వరకు వచ్చి అరెస్ట్ చేసి పెద్ద క్రిమినల్‌లా చూపించడం ముమ్మాటికీ తప్పే అవుతుందని విమర్శించారు. తెలుగు సినీ పరిశ్రమని ఒక స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పోలీసులను తల్లాడ సాయి కృష్ణ ప్రశ్నించారు.
I wish the kind of enthusiasm government authorities and media show in anything related to people from cinema was also there for the regular citizens. We would have lived in a better society. That was an unfortunate incident and it was heart breaking. We should all learn from the…
— Nani (@NameisNani) December 13, 2024
Comments
Please login to add a commentAdd a comment