ఫ్యాన్స్‌కి ‘స్టార్స్’ న్యూ ఇయర్‌ విషెస్‌ | Happy New Year 2025: Jr NTR, Allu Arjun And Nani New Year Wishes To Fans, Check Tweets Goes Viral | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌కి ‘స్టార్స్’ న్యూ ఇయర్‌ విషెస్‌.. చిరు అలా, బన్నీ ఇలా

Published Wed, Jan 1 2025 8:12 AM | Last Updated on Wed, Jan 1 2025 11:10 AM

Happy New Year 2025: Jr NTR, Allu Arjun, Nani And Other Stars New Year Wishes To Fans

​కొత్త సంవత్సరం వచ్చేసింది. 2024కు గుడ్‌బై చెప్పి 2025కి  వెల్‌కమ్‌ చెప్పేశారు. దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఇక తెలుగు స్టార్‌ హీరోల్లో చాలా మంది విదేశాల్లో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌  జరుపుకున్నారు. యూరప్‌లో మహేశ్‌, ప్రభాస్‌..లండన్‌లో ఎన్టీఆర్‌ కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే తామ ఎక్కడున్నా..అభిమానులను మాత్రం మరిచిపోమంటున్నారు మన హీరోలు. న్యూ ఇయర్‌ సందర్భంగా తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్‌ చేశారు. 

 ‘అందరికి నూత సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు మరింత ఆనందాన్ని, విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’అని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ లండన్‌లో ఉన్నారు. ఇటీవల వార్‌ 2 షూటింగ్‌కి గ్యాప్‌ రావడంతో ఫ్యామిలీతో కలిసి లండన్‌ వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి రాగానే ప్రశాంత్‌ నీల్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. ఈ  చిత్రానికి ‘డ్రాగన్‌’ అనే టైటిల్‌ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది.

 ఇక మరో స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ కూడా తన అభిమానులకు న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పారు. ‘ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను మీ అందరిని ప్రేమిస్తున్నాను’ అని బన్నీ ట్వీట్‌ చేశారు. 

ఇక నేచురల్‌ స్టార్‌ నాని కాస్త భిన్నంగా న్యూ ఇయర్‌ విషెస్‌ తెలియజేశాడు. ‘హ్యాపీ న్యూ ఇయర్‌. 2025 ‘సర్కార్‌’ ఇయర్‌’ అంటూ  ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’ కొత్త పోస్టర్‌ని వదిలాడు.శైలేశ్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఇది వచ్చే ఏడాది మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

2025వ సంవత్సరం మనందరికీ కొత్త ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని, భారతీయ సినిమా వైభవం మరింత విస్తరించి ప్రకాశవంతంగా వెలగాలని కోరకుంటూ మెగాస్టార్‌ చిరంజీవి నూతర సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement