
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 1970లో కలకత్తా నేపథ్యంలో నడుస్తుంది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో నాని కొత్త లుక్‌తో కనిపించనున్నాడు. ఇప్పటికే శ్యామ్ సింగరాయ్ నుంచి వచ్చిన అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ పేరుతో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.
‘‘శ్యామ్ సింగ రాయ్.. ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే.. వెనకబడని చైతన్యం వాడే’’ అంటూ ఈ సినిమాలో నాని పాత్ర స్వభావాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. మిక్కీ జే మేయర్ స్వారాలు అందించిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. విశాల్ దద్లాని, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ నెల 6వ తేదీన ఈ పాటను ఫస్ట్ సింగిల్ పేరుతో బయటకు వదలనున్నారు. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నాలు హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment