
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి 29వ పుట్టిన రోజు నేడు(మే 09). ఈ సందర్భంగా ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం నుంచి సాయి పల్లవి లుక్ విడుదల చేసింది చిత్ర బృందం. కాళికాదేవి అవతారంలో ఉగ్రరూపం దాల్చినట్లుగా ఉన్న ఈ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. పోస్టర్ అదిరిపోయిందంటూ సాయి పల్లవి అభిమానులను కొనియాడుతున్నారు. ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ తెరకెక్కుతుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి నిర్మిస్తున్నారు. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక సాయి పల్లవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు హీరో నాని. శ్యామ్ సింగరాయ్ పోస్టర్‌ని ట్వీటర్‌లో షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే చిన్ని గారు’ అని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా సాయిపల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన ’లవ్ స్టోరీ‘, ’విరాట పర్వం‘ సినిమాలు ఇప్పటికే విడుదల కవాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ సినిమాల విడుదల వాయిదా పడింది.
His ❤️#ShyamSinghaRoy
— Nani (@NameisNani) May 9, 2021
Happy birthday Chinni gaaru @Sai_Pallavi92 🤗 pic.twitter.com/kW0UBVIugb
Comments
Please login to add a commentAdd a comment