'శ్యామ్‌ సింగరాయ్‌'కు గుమ్మడికాయ కొట్టిన నాని | Nani Shyam Singha Roy Wraps Up Shooting | Sakshi
Sakshi News home page

Shyam Singha Roy: శ్యామ్‌ సింగరాయ్‌కు నాని గుడ్‌బై

Published Tue, Jul 27 2021 2:19 PM | Last Updated on Tue, Jul 27 2021 2:19 PM

Nani Shyam Singha Roy Wraps Up Shooting - Sakshi

నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’ షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టారు. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతీ శెట్టి, మడోనా సెబాస్టియన్‌ కథానాయికలు. షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా చిత్రనిర్మాత వెంకట్‌ బోయనపల్లి మాట్లాడుతూ – ‘‘విభిన్న కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేలా రాహుల్‌ సంకృత్యాన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఔట్‌పుట్‌ పట్ల నేను, మా టీమ్‌ హ్యాపీ’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. వెంకటరత్నం (వెంకట్‌).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement