ప్రస్తుతానికి నా గర్ల్‌ఫ్రెండ్ ఆయనే!
న్యూ జనరేషన్ హీరోల్లో నిఖిల్‌ది సెపరేట్ స్టయిల్.
ఒకసారి చేసిన కాన్సెప్ట్ ఇంకోసారి టచ్ చేయడు.
ఎప్పటికప్పుడు తనకంటూ ఓ పంథా ఏర్పరచుకున్న నిఖిల్
ఈ శుక్రవారం ‘శంకరాభరణం’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఈ సందర్భంగా నిఖిల్ మీడియాతో చెప్పిన ముచ్చట్లు...
* ఓ రోజు సడన్‌గా కోన వెంకట్ గారి నుంచి ఫోన్ వచ్చింది. కథ వినడానికి రమ్మన్నారు. విని ఇంప్రెస్ అయిపోయా. ఫుల్ నెరేషన్ కావాలని అడిగినా ఆయన ఫీల్ కాలేదు. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసి, నాకు వినిపించారు.
* ‘శంకరాభరణం’ టైటిల్ పెడుతున్నామని చెప్పగానే నేను షాకైపోయా. రిస్కు అవుతుందేమోనని చెప్పా. ఆ టైటిల్ తో మనం బూతు సినిమా సినిమా తీస్తే తప్పుగానీ మంచి కంటెంట్ అందిస్తే ఏం ఫరవాలేదని కోన గారు నాకు భరోసా ఇచ్చారు.
* ఈ టైటిల్ పెట్టడం వల్ల ఈ సినిమా ఎక్కువమందికి రీచ్ అయ్యిందని నా అభిప్రాయం.
* గతంలో నేను నటించిన ‘డిస్కో’ సినిమా చూస్తూ ఓ కుర్రాడు మధ్యలో హాలులో నుంచి వెళ్లిపోతూ, ‘భయ్యా... ఇక ఈ సినిమా చూడలేను’ అని కామెంట్ చేశాడు. నేను చాలా బాధపడ్డాను. ఇకపై అలాంటి సినిమాలు చేయకూడదని డిసైడై, ట్రెండ్ మార్చాను. అప్పటి నుంచి కొత్త తరహా కథలు ఎంచుకోవడం మొదలుపెట్టా. అలా ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘శంకరాభరణం’ నాకు దక్కాయి.
* సినిమా తర్వాత సినిమా చేయడమే కరెక్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా అనేది ఖరీదైన వ్యవహారం. క్వాలిటీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి. అలాగే ప్రమోషన్‌కు కూడా సమయం కేటాయించాలి.
* ‘టైగర్’ చిత్ర దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఫ్యాంటసీ నేపథ్యంలో సినిమా చేయనున్నా. అలాగే చందు మొండేటి ద ర్శకత్వంలో ‘కార్తికేయ-2’ చేస్తాను. దానికి ఇప్పటికే కథ రెడీ చేసేశాం. ‘కార్తికేయ’కు ఇది పర్‌ఫెక్ట్ సీక్వెల్.
* నేనింతవరకూ ప్రేమలో పడలేదు. చాలా ఏళ్లుగా ఐ యామ్ సింగిల్. ఇంటర్, ఇంజనీ రింగ్ ఎడ్యుకేషన్ టైమ్‌లో క్రషెస్ ఎవరికైనా కామన్ కదా. ఇప్పుడైతే నాకంత టైమ్ దొరకడం లేదు. సినిమాలతోనే గడిచిపోతోంది. ఇప్పుడు కోన గారే నా గర్ల్‌ఫ్రెండ్.
* మా ఇంట్లోవాళ్లు పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. ఇంకో రెండు సినిమాలు హిట్టయితే పెళ్లి చేసుకుంటానని వాయిదా వేసుకుంటూ వస్తున్నా. అయితే పెద్దలు కుదిర్చిన అమ్మాయినే చేసుకుంటా.
* ఆ మధ్య న్యూయార్క్‌లో ఫిలిం మేకింగ్ కోర్స్ చేశా. అది టైమ్‌పాస్ కోసమే. అంతేగానీ ఏదో డెరైక్షన్ చేసేద్దామని మాత్రం కాదు. నా దృష్టి ఎప్పుడూ యాక్టింగ్ మీదే.