ఇది నిఖిల్ ‘శంకరాభరణం!’ | Kona Venkat to Produce Nikhil's "Sankarabharanam" Movie | Sakshi
Sakshi News home page

ఇది నిఖిల్ ‘శంకరాభరణం!’

Published Sat, Mar 21 2015 10:30 PM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

ఇది నిఖిల్ ‘శంకరాభరణం!’

ఇది నిఖిల్ ‘శంకరాభరణం!’

ఏ తరానికైనా నచ్చే సినిమాలు కొన్నే ఉంటాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో ‘శంకరాభరణం’ ఒకటి. అలాంటి క్లాసిక్ పేరుతో ఇప్పుడు ఓ సినిమా మొదలైంది. ‘గీతాంజలి’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఎం.వి.వి. సినిమా పతాకంపై రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి. సత్యనారాయణ ఈ తాజా ‘శంకరాభరణం’ని నిర్మిస్తున్నారు. నిఖిల్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రం ద్వారా ఉదయ్ నందనవనమ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు.
 
 ఉగాదినాడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. కోన వెంకట్ మాట్లాడుతూ -‘‘నాటి ‘శంకరాభరణం’కీ, ఈ ‘శంకరాభరణం’కీ ఎలాంటి పోలికా ఉండదు. బీహార్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ కామెడీ కథకు ఈ టైటిలే బాగుంటుందని పెట్టాం. మనుషులు వెళ్లడానికి కూడా భయపడే ప్రమాదకరమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరపనున్నాం. హీరోగా, నటుడిగా నిఖిల్ స్థాయిని పెంచే చిత్రం అవుతుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రకథ అద్భుతంగా ఉంటుంది.
 
  మే రెండో వారంలో షూటింగ్ ప్రారంభించి, దసరాకి చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రచనాసహకారం: వెంకటేశ్ కిలారు, భవానీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహనిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement