బిహార్‌లో మలుపులు! | Sankarabharanam with a crime angle | Sakshi
Sakshi News home page

బిహార్‌లో మలుపులు!

Published Sun, Nov 8 2015 11:52 PM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM

బిహార్‌లో మలుపులు!

బిహార్‌లో మలుపులు!

అతనో ఎన్నారై. బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్. అందుకే అతనికి ఏ వస్తువైనా నచ్చితే ఎంత రేట్ అయినా పెట్టి మరీ దక్కించుకుంటాడు. కష్టాలంటే తెలీవు. ఇలాంటి కుర్రాడు ఓ పని మీద బిహార్‌లో అడుగుపెడతాడు. అప్పటి నుంచి అతనికి కష్టాలు పరిచయమవుతాయి. ఆ తర్వాత ఈ కుర్రాడి జీవితం ఎన్ని మలుపులు తీసుకుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘శంకరాభరణం’. కోన వెంకట్ సమర్పణలో నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎం.వి.వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘‘క్రైమ్‌లో కామెడీ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇంతకుముందు చాలా క్రైమ్ కామెడీ సినిమాలు వచ్చాయి. వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. డిసెంబరు 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని  తెలిపారు. ‘‘కోన వెంకట్ మంచి స్క్రిప్ట్ ఇచ్చారు. ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందించాం’’ అని నిర్మాత చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, సహ-నిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరరావ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement