ప్రియురాలితో భర్త పెళ్లి చేసిన భార్య | wife makes marriage husband's lover | Sakshi
Sakshi News home page

ప్రియురాలితో భర్త పెళ్లి చేసిన భార్య

Published Thu, Apr 28 2016 1:09 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

wife makes marriage husband's lover

రాజవొమ్మంగి : వారు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వాస్తవం గ్రహించిన అతడి భార్య.. ప్రియురాలి తో దగ్గరుండి భర్త వివాహం జరిపించింది. ఇదేమీ సినిమా స్టోరీ కాదు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలోని రాజవొమ్మంగి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది.

వివరాల్లోకి వెళితే రాజవొమ్మంగి గ్రామానికి చెందిన భూముల అప్పారావుకు, అదే గ్రామానికి చెందిన భాను అనే యువతిని ఇచ్చి పెద్దలు స్థానిక శ్రీకోదండ రాముల వారి ఆలయంలో వివాహం జరిపించారు. గతేడాది  అప్పారావు తప్పనిసరి పరిస్థితుల్లో ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇలాఉండగా అప్పారావు, భాను ప్రేమ వ్యవహారం తెలిసిన అతడి భార్య వారి వివాహానికి అంగీకరించింది. అంతటితో ఆగకుండా ఈ పెళ్లిని పెద్దల సమక్షంలో దగ్గరుండి జరిపించింది. ముగ్గురు ఇష్టపడటంతో ఈ పెళ్లి  జరిపించామని స్థానిక పెద్దలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement