ఆ విషయం భార్యకు చెప్తుందేమోనని... | HDFC manager kills lover by smashing her head against pavement | Sakshi
Sakshi News home page

ఆ విషయం భార్యకు చెప్తుందేమోనని...

Published Thu, Mar 10 2016 8:50 AM | Last Updated on Fri, Aug 17 2018 5:11 PM

ఆ విషయం భార్యకు చెప్తుందేమోనని... - Sakshi

ఆ విషయం భార్యకు చెప్తుందేమోనని...

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన జరిగింది. తమ మధ్య ఉన్న 'అఫైర్' గురించి ఎక్కడ భార్యకు చెబుతుందోనని భావించిన ఓ బ్యాంకు మేనేజర్ తన గర్ల్ ఫ్రెండ్ను దారుణంగా హతమార్చాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీన్ కుమార్(32) హెచ్డీఎఫ్సీ బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తనకు పెళ్లి కాలేదని నమ్మించి బ్యాంకులో సహోద్యోగిగా పనిచేస్తున్న పుణ్య సాగర్(28)తో గత కొంతకాలంగా అఫైర్ నడుపుతున్నాడు. అయితే నవీన్కు అప్పటికే పెళ్లయిపోయిందని, అతనికి పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకున్న పుణ్య సాగర్.. తమ అఫైర్ గురించి భార్యకు చెబుతానని బెదిరించింది. దీంతో హడలిపోయిన నవీన్ బయటకు తీసుకెళ్తానని నమ్మించి పుణ్య సాగర్ను కారులో నగర శివార్లకు తీసుకెళ్లి దారుణంగా హతమార్చాడు. నవీన్ ఆమె తలను ఫుట్పాత్కు బలంగా కొట్టడంతో ఆమె కోమాలోకి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు నవీన్ కుమార్ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement