ప్రేమించలేదని నిప్పంటించాడు.. | boyfriend kills girlfriend | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని నిప్పంటించాడు..

Published Sat, Aug 19 2017 2:57 PM | Last Updated on Sun, Sep 17 2017 5:42 PM

ప్రేమించలేదని నిప్పంటించాడు..

ప్రేమించలేదని నిప్పంటించాడు..

విశాఖపట్టణం: ప్రేమ త్యాగం కోరుతుంది అంటారు. తాను ప్రేమించిన వ్యక్తి ఎక్కడ ఉన్నా సంతోషంగా సుఖంగా ఉండాలనే ప్రేమికులు కోరుకుంటారు. కానీ విశాఖ జిల్లాలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించలేదంటూ యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. భీమిలి మండలం టీనగరం పాలెంలో శనివారం దారుణం చోటుచేసుకుంది.

నిందితుడు సంతోష్‌ గత ఆరునెలలుగా రూపను ప్రేమిస్తున్నానంటూ వేధించసాగాడు. అయితే రూప సంతోష్‌ ప్రేమను నిరాకరించింది. దీంతో రగిలిపోయిన సంతోష్‌ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న రూపపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా కాలిన గాయాలతో రూప చనిపోగా అడ్డుకోబోయిన రూప సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని బంధువులు వెంటనే కేజీహెచ్ కు తరలించారు. కాగా, సంతోష్ విజయనగరం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు ఫోన్ సమాచారం అందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement