ప్రియురాలికి అలా ప్రపోజ్ చేశాడు..! | This Pilot Proposed To His Girlfriend By Faking A Plane Emergency | Sakshi
Sakshi News home page

ప్రియురాలికి అలా ప్రపోజ్ చేశాడు..!

Published Sun, Jan 24 2016 11:21 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

ప్రియురాలికి అలా ప్రపోజ్ చేశాడు..!

ప్రియురాలికి అలా ప్రపోజ్ చేశాడు..!

కొత్తగా ప్రపోజ్ చేయడం... ప్రియురాలిని ప్రసన్నం చేసుకోవడం ప్రేమలో ఇవన్నీ మామూలే. అలాగే ఆకాశంలో, నీటిలోపలి, పర్వత శిఖరాగ్రాన పెళ్లిళ్లు చేసుకోవడమూ చూశాం. అయితే ఓ పెలైట్‌కు కొత్త ఆలోచన వచ్చింది. ఓగోట్ అనే ఈ పెలైట్ ఓ రెండు సీట్ల విమానంలో ప్రియురాలిని తీసుకొని కాలిఫోర్నియాలోని కాథలినా ఐలండ్‌కు బయలుదేరాడు. మార్గమధ్యంలో విమానంలో ఏదో సమస్య వచ్చిందని, అదుపు తప్పిందని ఎమర్జెన్సీ అంటూ ప్రకటించాడు. అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలో చెప్పే చార్ట్‌ను ఆమెకు అందించి బిగ్గరగా చదవమని చెప్పాడు.

కాస్త ధైర్యంగానే ఉన్న ఆమె ఓగోట్ చెప్పినట్లే చార్ట్‌ను చదవడం మొదలుపెట్టింది. అలా చదువుతూ వెళుతుండగా... ‘డు యూ లవ్ ది పెలైట్?’ అని రాసుంది. దాన్ని కూడా చదివేసి... బిక్కమొహం వేసి ప్రియుడి వైపు చూసింది. అప్పుడతను తన జేబులో నుంచి ఎంగేజ్‌మెంట్ రింగ్ తీసి ఆమెకు ప్రపోజ్ చేశాడు. తర్వాత అసలు విషయం చెప్పాడు. విమానం భేషుగ్గా ఉందని... ప్రపోజ్ చేయడానికే తాను అబద్ధమాడానని చెప్పాడు. దాంతో ఆమె అతన్ని క్షమించేసి ఓకే చెప్పింది. దీన్ని ఓగోట్ వీడియో తీసి యూట్యూబ్‌లో ఆప్‌లోడ్ చేశాడు. అక్కడ ఇప్పుడిది ఓ హిట్టు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement