ప్రేమలో పడితే.. బరువు పోయే కాలం..! | obese man sheds 8 stone to have his first kiss after meeting love of his life online | Sakshi
Sakshi News home page

ప్రేమలో పడితే.. బరువు పోయే కాలం..!

Published Tue, Sep 23 2014 8:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

ప్రేమలో పడితే.. బరువు పోయే కాలం..!

ప్రేమలో పడితే.. బరువు పోయే కాలం..!

ఈ రెండు ఫొటోల్లో ఉన్నది ఒక్కరే. పేరు జేక్ గోల్డింగ్.. వయసు 23 ఏళ్లు.. ఉండేది లీసెస్టర్‌లో.. మొదటి ఫొటో ప్రేమలో పడకముందు తీసింది.. రెండోది ప్రేమలో పడిన తర్వాత తీసింది.. చూశారా ఎంత తేడా ఉందో? పుట్టినప్పుటి నుంచే జేక్‌కు బరువు ఓ పెద్ద సమస్య అయిపోంది. వయసుతో పాటే అదీ పెరిగిపోతూ వచ్చింది. అలా 23 ఏళ్లకు వచ్చేసరికి ఏకంగా 147 కిలోల బరువు పెరిగిపోయాడు.

ఎక్కడకెళ్లినా అవహేళనలు.. ఆటపట్టించడాలే.. ఒక్క గర్ల్‌ఫ్రెండ్ కూడా లేని పరిస్థితి. ఈ క్రమంలో గతేడాది మే నెలలో అతడికి న్యూయార్క్ చెందిన కార్లిసా ఆన్‌లైన్‌లో పరిచయమైంది. ఇద్దరికీ ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చాయి. అయితే తాను లావుగా ఉంటానన్న విషయాన్ని కార్లిసాకు చెప్పాడు. కానీ ఆమెను వదులుకోలేనని కూడా స్పష్టంచేశాడు. అతడి ప్రేమలోని నిజాయతీ గుర్తిం చిన కార్లిసా తనకు లావు పెద్ద సమస్య కాదని చెప్పింది.

అయినా సరే తాను బరువు తగ్గి తీరతానని జేక్ ప్రతినబూనాడు. అప్పటివరకు కార్లిసాను కలుసుకోనని కూడా స్పష్టంచేశాడు. వెంటనే కఠినమైన డైటింగ్ చేయడంతోపాటు వ్యాయామం చేసేవాడు. అతడి ప్రయత్నాలకు కార్లిసాకూడా మద్దతుగానిలిచి ప్రోత్స హించింది. ఇంకేముంది.. కేవలం ఎనిమిది నెల్లోనే ఏకంగా 52 కిలోల బరువు తగ్గి ఇలా స్లిమ్‌గా అయిపోయాడు. ఆ తర్వాత తన నిచ్చెలిని కలుసుకుని తొలిముద్దులోని మాధుర్యాన్ని కూడా చవిచూశాడు. మొత్తానికి ప్రేమలో పడితే పోయేకాలం కాదు.. బరువు పోయే కాలం అని జేక్ నిరూపించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement