Leicester
-
యూకేలో ఆలయాలపై దాడులు... కేంద్రం ఖండన
లండన్: యూకేలోని లీసెస్టర్ నగరంలోని భారతీయులపై దాడులు, అక్కడి ఆలయం ఆవరణలో విధ్వంసం ఘటనలను భారత దౌత్య కార్యాలయం తీవ్రంగా ఖండించింది. దాడులకు కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యూకే యంత్రాంగాన్ని డిమాండ్ చేసింది. బాధితులకు రక్షణ కల్పించాలని కోరింది. గత నెలలో దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం నగరంలోని హిందూ ముస్లిం గ్రూపుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. లీసెస్టర్‌లోని ఆలయం వద్ద ఎగురవేసిన కాషాయ జెండాను కొందరు చించి వేస్తున్నట్లున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. -
డేవిడ్ బెక్‌హమ్ కోసం సెర్చ్ చేస్తే.. సస్పెండ్ చేశారు!
లండన్: భారత సంతతికి చెందిన ఓ పోలీస్ అధికారి తన అధికారాన్ని దుర్వినియోగ పరచినందుకుగాను విధుల్లో నుంచి సస్పెండ్ చేశారు. దీనికి కారణం.. అతను ఆఫీస్‌లోని కంప్యూటర్లో దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హమ్, అతని భార్య విక్టోరియా బెక్హమ్లకు సంబంధించిన సమాచారాన్ని వెతకడమే. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని లీసెస్టర్‌షైర్ ప్రాంతానికి చెందిన పోలీసు విభాగంలో అజిత్ సింగ్(48) పనిచేస్తున్నాడు. అయితే విధుల్లో ఉండి, అధికారాన్ని దుర్వినియోగపరచి బెక్‌హమ్, అతని భార్య విక్టోరియా బెక్‌హమ్‌కు సంబంధించిన సమాచారాన్ని వెతకడంతో పోలీస్ విభాగ అధికారులు అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అజిత్ సింగ్ 2002, 2018 సంవత్సరాల్లో కంప్యూటర్లో సమాచారాన్ని దుర్వినియోగపరచాడని తేటతెల్లమైంది. లీసెస్టర్‌లోని మాన్స్ఫీల్డ్ హౌస్ పోలీస్ స్టేషన్లో అజిత్ సింగ్ విధులు నిర్వర్తిస్తున్నప్పుడు కంప్యూటర్ను ఉపయోగించి మొత్తం 146 సార్లు పోలీస్ డేటాబేస్‌ను అనాధికారికంగా వినియోగించాడని రుజువైంది. అందులో ఎక్కువగా డేవిడ్ బెక్‌హమ్, అతని భార్య విక్టోరియా బెక్‌హమ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు, ఆస్తి పాస్తులను గూర్చి ఎక్కువగా వివరాలను సేకరించే ప్రయత్నం చేశాడని రుజువైంది. ఇందుకుగాను లీసెస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం దుష్ప్రవర్తన, క్రమశిక్షణ ఉల్లంఘన కింద మూడు నెలల జైలు శిక్షతో పాటు ఎటువంటి విధులు నిర్వర్తించకుండా సంవత్సరంపాటు సస్పెండ్ చేసింది. అంతేకాక చట్టపరమైన ఖర్చులకు 300 పౌండ్లు, బాధితులకు సర్‌చార్జీ కింద 115 పౌండ్లు చెల్లించాలని ఆదేశించారు. కాగా అజిత్ సింగ్ (48) ప్రస్తుతం అనారోగ్య సెలవుపై ఉన్నారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జూలియన్ లెస్టర్ మాట్లాడుతూ.. ఇటువంటి ప్రవర్తన పోలీసు శాఖలో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నేరారోపణలు రుజువైన పక్షంలో క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే అజిత్ సింగ్‌కు ఇతరులకు ఎటువంటి హానిచేసే ఉద్దేశం లేదని, కంప్యూటర్‌తో తను శోధించిన సమాచరంతో తనకు చిల్లిగవ్వంత ఆస్తి కూడా సంపాదించలేదని అతని తరపున లాయర్ అలెగ్జాండర్ బార్బర్ కోర్టుకు విన్నవించారు. -
‘గుజరాతీలు జాగ్రత్త.. ఫైన్ కట్టాల్సి వస్తుంది’
లండన్ : హెడ్డింగ్ చూసి ఓ తెగ కంగారు పడిపోకండి. ఇది మన దేశంలో ఉన్న గుజరాతీల కోసం కాదు. యూకేలో నివసిస్తున్న గుజరాతీల కోసం. ఒక్క గుజరాతీలనే కాదు.. యూకేలోని లిసెస్టర్‌లో ఉంటూ పాన్ ఇష్టపడే ప్రతీ భారతీయునికి ఈ హెచ్చరిక వర్తిస్తుంది. ఇంతకూ ఈ హెచ్చరిక ఎందుకంటే.. పాన్‌పై మనకున్న మక్కువ వారికి తెగ ఇబ్బంది కలిగిస్తుందట. ముఖ్యంగా లిసెస్టర్ ప్రజలు మన వారి పాన్ అలవాటు వల్ల తెగ ఇబ్బంది పడుతున్నారట. దాంతో ‘పాన్ తిని రోడ్ల మీద ఉమ్మి వేయడం మంచి పద్దతి కాదు. అలా చేసిన వారికి రూ. 13 వేల రూపాయల జరిమానా విదిస్తామ’ని హెచ్చరిస్తూ సైన్ బోర్డ్ ఏర్పాటు చేశారు అక్కడి పోలీసులు. Just for information. pic.twitter.com/bd481XA2em — Never fear to speak the truth سچ بولنے سے کبھی ن (@EmpoweringGoa) April 12, 2019 ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా లిసెస్టర్‌లో ఉండే గుజరాతీలు పాన్ తినడం.. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం చేస్తున్నారట. అందుకే ఈ సైన్ బోర్డ్‌ను కూడా ఇంగ్లీష్, గుజరాతీ రెండు భాషల్లో ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ప్రభుత్వం ఇలా హెచ్చరికలు జారీ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశారు. కొన్ని రోజుల వరకూ సమస్య సర్దుకున్నట్లే కనిపించింది. తర్వాత మళ్లీ షరా మామూలే. దాంతో ఈ సారి పాన్ నమిలి రోడ్ల మీద ఉమ్మేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని భావించింది ప్రభుత్వం. అందుకే భారీ మొత్తంలో జరిమానా విధిస్తానంటూ ఇలా సైన్ బోర్డులు ఏర్పాటు చేసింది. -
ప్రేమలో పడితే.. బరువు పోయే కాలం..!
ఈ రెండు ఫొటోల్లో ఉన్నది ఒక్కరే. పేరు జేక్ గోల్డింగ్.. వయసు 23 ఏళ్లు.. ఉండేది లీసెస్టర్‌లో.. మొదటి ఫొటో ప్రేమలో పడకముందు తీసింది.. రెండోది ప్రేమలో పడిన తర్వాత తీసింది.. చూశారా ఎంత తేడా ఉందో? పుట్టినప్పుటి నుంచే జేక్‌కు బరువు ఓ పెద్ద సమస్య అయిపోంది. వయసుతో పాటే అదీ పెరిగిపోతూ వచ్చింది. అలా 23 ఏళ్లకు వచ్చేసరికి ఏకంగా 147 కిలోల బరువు పెరిగిపోయాడు. ఎక్కడకెళ్లినా అవహేళనలు.. ఆటపట్టించడాలే.. ఒక్క గర్ల్‌ఫ్రెండ్ కూడా లేని పరిస్థితి. ఈ క్రమంలో గతేడాది మే నెలలో అతడికి న్యూయార్క్ చెందిన కార్లిసా ఆన్లైన్లో పరిచయమైంది. ఇద్దరికీ ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చాయి. అయితే తాను లావుగా ఉంటానన్న విషయాన్ని కార్లిసాకు చెప్పాడు. కానీ ఆమెను వదులుకోలేనని కూడా స్పష్టంచేశాడు. అతడి ప్రేమలోని నిజాయతీ గుర్తిం చిన కార్లిసా తనకు లావు పెద్ద సమస్య కాదని చెప్పింది. అయినా సరే తాను బరువు తగ్గి తీరతానని జేక్ ప్రతినబూనాడు. అప్పటివరకు కార్లిసాను కలుసుకోనని కూడా స్పష్టంచేశాడు. వెంటనే కఠినమైన డైటింగ్ చేయడంతోపాటు వ్యాయామం చేసేవాడు. అతడి ప్రయత్నాలకు కార్లిసాకూడా మద్దతుగానిలిచి ప్రోత్స హించింది. ఇంకేముంది.. కేవలం ఎనిమిది నెల్లోనే ఏకంగా 52 కిలోల బరువు తగ్గి ఇలా స్లిమ్‌గా అయిపోయాడు. ఆ తర్వాత తన నిచ్చెలిని కలుసుకుని తొలిముద్దులోని మాధుర్యాన్ని కూడా చవిచూశాడు. మొత్తానికి ప్రేమలో పడితే పోయేకాలం కాదు.. బరువు పోయే కాలం అని జేక్ నిరూపించాడు.