కొట్టేసిన ఉంగరంతో ప్రియురాలికి ప్రపోజ్‌ చేసి... | UK police say thief who proposed with stolen ring is jailed | Sakshi
Sakshi News home page

కొట్టేసిన ఉంగరంతో ప్రియురాలికి ప్రపోజ్‌ చేసి...

Published Sat, Jul 8 2017 4:46 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

UK police say thief who proposed with stolen ring is jailed

లండన్‌: ఓ వృద్ధురాలి నుంచి దోచుకున్న ఉంగరంతో ప్రియురాలికి ప్రపోజ్‌ చేశాడో వ్యక్తి. అయితే ఆ విషయం ప్రియురాలికి తెలియడంతో అతడిని పోలీసులకు పట్టించింది. ఈ ఘటన లండన్‌లోని వెస్ట్‌ మిడ్‌ల్యాండ్స్‌లో జరిగింది. స్టీవ్‌ రీడ్‌ అనే వ్యక్తి మరొకరితో కలిసి ఓ వృద్ధురాలి ఇంట్లో దొంగతనంగా జొరబడ్డారు. వృద్ధురాలిని బెదిరించి ఆమె నగలు, నగదును దోచుకున్నారు. అందులో ఒక ఉంగరం కూడా ఉంది. ఆ ఉంగరాన్ని తీసుకెళ్లి తన ప్రియురాలికి ఇచ్చి పెళ్లి చేసుకోవాలని కోరాడు.
 
అయితే, అంతకుమునుపే పోలీసులు దోపిడీ విషయమై ప్రసారమాధ్యమాల్లో పౌరులకు విజ్ఞప్తి చేశారు. వృద్ధురాలికి చెందిన నగల జాడ కనిపిస్తే తమకు సమాచారం అందివ్వాలని కోరారు. ఇది తెలుసుకున్న సదరు ప్రియురాలు ఉంగరం విషయాన్ని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు స్టీవ్‌రీడ్‌తో పాటు అతడి స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన న్యాయస్థానం రీడ్‌కు నాలుగేళ్ల 9 నెలల జైలుశిక్ష విధించింది. అయితే, రీడ్‌ పెళ్లి ప్రతిపాదనను సదరు ప్రియురాలు అంగీకరించింది లేనిదీ పోలీసులు వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement