పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా
శ్రీశైలం ప్రాజెక్టు: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఓ యువతి శుక్రవారం ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. సున్నిపెంట గ్రామంలోని చేపల మార్కెట్ ప్రాంతంలో నివసిస్తున్న తాను, ఊదర నిర్మల జయప్రకాశ్ ఐదేళ్ల నుంచి (23) ప్రేమించుకుంటున్నామని చెప్పారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేశాడని ఆమె విలేకరులతో వాపోయింది. అతడితో తన పెళ్లి జరిపించాలని కోరారు. ఈ విషయమై టూటౌన్ ఎస్‌ఐ హెచ్ ఓబులేష్ మాట్లాడుతూ ప్రేమ వ్యవహారంపై తనకు లిఖిత పూర్వక ఫిర్యాదు అందలేదని, విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని తెలిపారు.