దాక్కున్న ప్రియుడు... ప్రేయసి ధర్నా | Boy escapes When girlfriend Asks him to Marry her | Sakshi
Sakshi News home page

దాక్కున్న ప్రియుడు... ప్రేయసి ధర్నా

Published Thu, Apr 23 2015 11:38 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

దాక్కున్న ప్రియుడు... ప్రేయసి ధర్నా - Sakshi

దాక్కున్న ప్రియుడు... ప్రేయసి ధర్నా

గుంటూరు(తాడేపల్లి): 9 ఏళ్ల నుంచి ప్రేమపేరుతో తిరిగిన వ్యక్తి తీరా పెళ్లికి నిరాకరించడంతో ప్రేయసి ధర్నాకి దిగింది.  తాడేపల్లికి చెందిన గడ్డిపోగు అనిల్ అదే గ్రామానికి చెందిన కుమారి 9 ఏళ్లు గా ప్రేమించుకుంటున్నారు. అయితే తీరా పెళ్లి అనే సరికి అనిల్ విముఖత వ్యక్తం చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిన అనిల్ పోలీసులకు దొరకకుండా తన అక్క ఇంట్లో ఉంటున్నాడు. ఇది తెలిసిన యువతి తన కుటుంబ సభ్యులతో కలసి ఇంటి ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement