అసభ్య దృశ్యాలు యూట్యూబ్‌లో పెట్టాడు...
పోలీసులను ఆశ్రయించిన వివాహిత
బంజారాహిల్స్: ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని తనను దూరం పెట్టిందనే అక్కసుతో ఓ యువకుడు ఆమె కు తెలియకుండా తీసిన అసభ్యకర వీడియోను యూట్యూబ్‌లో పెట్టేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహి ల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... వరంగల్ జిల్లా హసన్‌పర్తికి చెందిన యువతి (23) 2012 నుంచి 2014 వరకు ఉద్యోగ శిక్షణా తరగతుల కోసం బేగంపేటకు వెళ్లేది. అక్కడ పనిచేస్తున్న శీలబోయిన అనిల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మంచి 2014లో ఆమెను రహ్మత్‌నగర్‌లో ఉన్న తన గదికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమెకు తెలియకుండా ఆ దృశ్యాలను వీడి యో తీశాడు. ఇటీవల ఆమెకు మరొకరితో పెళ్లి అయింది.
ఇది జీర్ణించుకోలేని అనిల్ ఆమెతో ఉన్నప్పటి అసభ్యకర వీడియోను యూట్యూబ్‌లో పెట్టాడు. గతనెల 2న బాధితురాలి స్నేహితులు ఈ దృశ్యాలు చూసి ఆమెకు తెలియజేశారు. అంతేకాకుండా ఈ విషయం అత్తవారింట్లో కూడా తెలిసింది. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు అనిల్‌పై ఐపీసీ సెక్షన్ 354(బి), 506, 509, 417, 420ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.