ప్రేయసి కాళ్లు పట్టుకుని... | Girlfriend grabbed the legs... | Sakshi
Sakshi News home page

ప్రేయసి కాళ్లు పట్టుకుని...

Published Tue, May 24 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM

ప్రేయసి   కాళ్లు పట్టుకుని...

ప్రేయసి కాళ్లు పట్టుకుని...

ప్రేయసి ‘ఇక చాలు.. విడిపోదాం’ అని చెబితే కొంతమంది ఎగిరి గంతేస్తారు.. మరికొందరు దేవదాసులా మారిపోతారు. కానీ చైనాలో ఓ కుర్రాడు మాత్రం ‘ప్లీజ్ నన్ను వదలద్దు’ అంటూ అచ్చంగా ఆమె కాళ్లు పట్టుకుని నేలమీద పడి ఆమెను ప్రాధేయపడ్డాడు. ‘ఛీ.. పో.. నువ్వు నాకు వద్దు’ అంటూ ఆ అమ్మాయి అతగాడిని పలుమార్లు చెంపమీద కొట్టింది. అయినా అతడు మాత్రం వదల్లేదు. అతడు గట్టిగా ఆమె కాళ్లు పట్టుకుని ఉండటంతో ఆమెకు తప్పించుకుని పోవడానికి కూడా వీలు కుదర్లేదు. రోడ్డు మధ్యలో నేలమీద పడి.. ఆమె కాలు పట్టుకుని ప్రేమభిక్ష పెట్టమంటూ వేడుకున్నాడు. అయినా ఆమె మాత్రం అతడిని చీదరించుకుంటూ ‘సిగ్గు లేదా.. నన్ను వెళ్లనివ్వు, నీకు చికాకు అనిపించడం లేదా’ అని విసుక్కుంది.


చివరకు కాళ్లతోను, చేతులతోను కొట్టడం మొదలుపెట్టింది. కానీ అతడు మాత్రం ‘దయచేసి.. నన్ను వదలొద్దు’ అంటూ ప్రాధేయపడుతూనే ఉన్నాడు. ఆమె మాత్రం ఇక ఇద్దరం కలిసుండే ప్రసక్తి లేనే లేదని చెబుతోంది. తూర్పు చైనాలోని జియాంగ్సు రాష్ర్టంలో గల హువియాన్ నగరంలో ఈ సంఘటన జరిగింది. చుట్టుపక్కల వెళ్లే వారంతా ఇది చూసి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement