ప్రేయసి ముందే రెండుసార్లు గుండెలో పొడుచుకొని.. | Young man died after stabbing himself in chest in front of girlfriend after row | Sakshi
Sakshi News home page

ప్రేయసి ముందే రెండుసార్లు గుండెలో పొడుచుకొని..

Published Sat, Jul 2 2016 10:20 AM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM

ప్రేయసి ముందే రెండుసార్లు గుండెలో పొడుచుకొని.. - Sakshi

ప్రేయసి ముందే రెండుసార్లు గుండెలో పొడుచుకొని..

లండన్: ప్రేయసి ముందే గుండెలో పొడుచుకొని ప్రాణాలు తీసుకున్నాడు ఓ ప్రేమికుడు. తాను ఇప్పుడు ఆ పనిచేయకుంటే తన బతుకుకే అర్థం లేదని గట్టిగా అరుస్తూ ప్రియురాలి ముందే కత్తితో రెండుసార్లు ఛాతీలో దించుకొని రక్తపుమడుగులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం అతడి ప్రేయసి కోర్టులో తెలిపింది. జరాద్ కార్కోవిక్ (23) అనే యువకుడు కైషా కార్నే అనే యువతితో చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. అతడు ఓ గ్యాస్ ఇంజినీర్.

చిన్నవయసులోనే జీవితంలో స్థిరపడిన అతడు మంచి ఉద్యోగం, మనసుకు నచ్చిన గర్ల్ ఫ్రెండ్తో చాలా చక్కగా జీవితాన్ని సాగిస్తున్నాడు. అయితే, అలా కొద్ది కాలం గడిచిన తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ చిరాకులో ప్రతి రోజు ఆగ్రహంతో ఊగిపోతుండేవాడు. ఆ కోపం ఎవరిపై చూపించలేక గోడలు తన్నడం సోపాలు విసిరేయడం, వస్తువులు పగలగొట్టడం వంటివి చేసేవాడు. అలాంటిది జనవరి 22న మరోసారి గర్ల్ ఫ్రెండ్ తో గొడవపడి జిమ్ కు వెళ్లాడు. అటు నుంచి నేరుగా గర్ల్ ప్రెండ్ ఇంటికి వచ్చాడు.

అప్పటికే బయటకు వెళ్లొచ్చిన గర్ల్ ప్రెండ్ అతడిని తన ఇంట్లో చూసి షాక్ అయింది. మరోసారి వారిద్దరి మధ్య వాదనలు జరిగాయి. దీంతో అతడు తన తలను అక్కడి వార్డ్ రోబ్ కేసి బలంగా కొట్టాడు. అనంతరం అక్కడ కత్తిని తీసుకొని ఆమె కళ్లముందే వరుసగా రెండుసార్లు గుండెలో పొడుచుకున్నాడు. అక్కడ కుప్పకూలిపోతున్న తన బాయ్ ఫ్రెండ్ని చేతుల్లోకి తీసుకొని ఎందుకిలా చేశావ్ అని ప్రశ్నించగా.. తను ఇలా చేయకుంటే తన జీవితానికి అర్థం లేదని స్పృహకోల్పోయాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ గురించి కైషా కోర్టులో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement