ప్రియుడి చెంప చెల్లుమనిపించిన ప్రేయసి.. ఎందుకంటే? | Man Rates His Girlfriend Just A FOUR Out Of Ten And She Slaps Him Viral Video | Sakshi
Sakshi News home page

ప్రియుడి చెంప చెల్లుమనిపించిన ప్రేయసి.. ఎందుకంటే?

Published Mon, Jul 5 2021 10:16 PM | Last Updated on Mon, Jul 5 2021 10:27 PM

Man Rates His Girlfriend Just A FOUR Out Of Ten And She Slaps Him Viral Video - Sakshi

లండన్‌: ప్రేమకు హద్దులుండవు. ప్రేమ అనేది ఓ అద్భుతమైన భావన. ప్రేమ గురించి ఎంతో మంది ఎన్నో విషయాలను చెబుతుంటారు. ఇక సమయ పరీక్షను తట్టుకుని నిలబడిన ఎన్నో ప్రేమ కథలు సోషల్‌ మీడియాలో నెటిజన్‌ల హృదయాలను గెలుచుకుంటూనే ఉంటాయి. అయితే తాజాగా ఓ ప్రేమికుడు తన ప్రేయసికి 10 కి 4 రేటింగ్‌ ఇవ్వడంతో ప్రియుడి చెంప చెల్లుమనిపించింది ప్రియురాలు .  వివరాల్లోకి వెళితే.. లండన్‌కి చెందిన ఓ వ్యక్తిని టిక్‌టాక్‌ యూజర్‌ ఇంటర్వ్యూ చేశాడు. 

ఆ సమయంలో తనకు గాల్‌ ఫ్రెండ్‌ ఉందని చెప్పడంతో.. రేటింగ్‌ అడిగాడు. అయితే 10 కి 4 మాత్రమే ఇవ్వడంతో.. అతడి వెనకాలే ఉన్న ప్రేయసి.. ప్రియుడి చెంప చెల్లుమనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. ఇప్పటి వరకు 4 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు.  దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘ప్రేయసికి 10\10 ఇవ్వాలి.. లేకుంటే ఇలాగే ఉంటుంది.’’ అంటూ కామెంట్‌ చేశారు. ఇక మరో నెటిజన్‌ ‘‘ఈ వీడియో కావాలనే చేశారు.’’ అని రాసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement