ఓ కామాంధుడు బాలికను ప్రేమ పేరుతో నమ్మించి వంచనకు పాల్పడ్డాడు.
రాజమండ్రి క్రైమ్: ఓ కామాంధుడు బాలికను ప్రేమ పేరుతో నమ్మించి వంచనకు పాల్పడ్డాడు. అత్యాచారం చేయడమే కాకుండా ఆ తర్వాత వ్యభిచార గృహానికి విక్రయించబోయాడు. దీనిపై బాధిత బాలిక రాజమండ్రి త్రీటౌన్ పోలీసులకు ఆదివారం మధ్యాహ్నం ఫిర్యాదు చేసింది. ప్రాథమిక సమాచారం మేరకు... రాజమండ్రిలోని సీటీఆర్‌ఐ ప్రాంతానికి చెందిన బాలికకు ఓ యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై... అత్యాచారం చేసి వ్యభిచార కేంద్రానికి విక్రయించే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.