టోక్యో : జపాన్ బిలియనీర్, ఆన్‌లైన్ ఫ్యాషన్ కంపెనీ జోజో చీఫ్ యుసాకు మేజావా(44) మళ్లీ సంచలన ప్రకటనతో మళ్లీ హల్ చల్ చేస్తున్నాడు. తనకొక ప్రేయసి కావాలంటూ ఆన్‌లైన్‌లో ప్రకటనల విడుదల చేసి మరోసారి వార్తలకెక్కాడు. మధ్య వయసులో ఒంటరితనంతో బాధపడుతున్న తనకు ఒక తోడు కావాలని, తద్వారా జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నట్టు వెల్లడించాడు. అంతేకాదు 20 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అమ్మాయి తనతోపాటు స్పేస్‌ఎక్స్ రాకెట్‌లో చంద్రుని చుట్టూ తిరిగే బంపర్ ఆఫర్ కూడా కొట్టేయవచ్చని ప్రకటించాడు.
ఇద్దరు మహిళలతో ఇప్పటికే ముగ్గురు పిల్లలున్న పారిశ్రామికవేత్త మేజావా, ఇటీవల మేజావా, ఇటీవల జపాన్ నటితో విడిపోతున్నట్లు ప్రకటించాడు. తాను ఇప్పటివరకు తాను కోరుకున్నట్లే జీవించానని పేర్కొన్నాడు. ఒంటరితనంతో పాటు, జీవితంలో వెలితి తనను బాధిస్తోందని, అందుకే ఒక మహిళ తోడు కావాలని కోరుకుంటున్నట్టు తన ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని మేజావా తన ట్విట్టర్ ఖాతాలో కూడా షేర్ చేశాడు. "చంద్రుడిపైకి ప్రయాణించే 'మొదటి మహిళ' మీరే ఎందుకు కాకూడదు?" దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ జనవరి 17, 2020. మార్చి చివరి నాటికి తుది ఎంపిక వుంటుందని ట్వీట్ చేశాడు.
కాగా ఇటీవల తన ట్విటర్ ఖాతాను ఫాలోఅయిన వారికి కోట్లాది రూపాయల కానుక యుసాకు మేజావా ప్రకటించాడు. జనవరి 1న తాను చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన వారికి ఈ నగదును పంచిపెట్టాడు. అలాగే టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ చేపట్టిన స్పేస్‌ఎక్స్ ప్రాజెక్టులో సైన్ చేసి 2023లో చంద్రుడిని చుట్టి రానున్నమొదటి ప్రైవేట్ ప్రయాణీకుడిగానిలిచిన సంగతి తెలిసిందే.
చదవండి : జపాన్ కుబేరుడు సంచలన నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment