పెళ్లి చేసుకుంటాననిచెప్పి ... | boyfriend cheating on girlfriend | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటాననిచెప్పి ...

Published Sun, Jul 8 2018 11:09 AM | Last Updated on Sun, Jul 8 2018 12:11 PM

boyfriend  cheating on girlfriend - Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు, మాఘొరొ అధ్యక్షురాలు తదితరులు

జయపురం: పెళ్లి చేసుకుంటాననిచెప్పి శారీరక సంబంధం ఏర్పరచుకుని తరువాత పరానైన మోసగాడిని పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటన నవరంగపూర్‌ జిల్లాలోని తెంతులికుంఠి సమితిలో జరిగింది. ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన నవరంగపూర్‌ మా ఘొరో సంస్థ అధ్యక్షురాలు కాదంబరి త్రిపాఠి కలుగ జేసుకుని బాధితురాలి తరఫున పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. నవరంగపూర్‌ జిల్లా తెంతులికుంఠి సమితిలో 12ఏళ్ల బాలికను అదే సమితిలోని అంవలాభట గ్రామానికి చెందిన ధర్మేంధ్ర పాత్రో(20)పెళ్లి చేసుకుంటానని  ప్రలోభపెట్టి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. 

అంతేకాకుండా తన ఇంటిలో ఆమెను ఉంచి భార్యాభర్తలుగా కొంతకాలం గడిపాడు. గ్రామ పెద్దలు కూడా వారి భార్యాభర్తల బంధాన్ని అంగీకరించారు. అందుకు ఉభయ కుటుంబాల వారు కూడా తమ అంగీకారం తెలిపారు. అందుచేత వారు భార్యార్యభర్తలుగా కాలం గడుపుతున్నారు. అయితే ఇటీవల  భార్యను వరకట్నం తెమ్మని బాధిస్తూ లేకపోతే చంపుతానని బెదిరిస్తున్నట్లు çబాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా తనను విడిచి వెళ్లాలని ఆమెను వేధిస్తున్నాడని  బాధితురాలి తరఫున మాఘోరొ సంస్థ, బాధితురాలి బంధువులు తెంతులి కుంఠి  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. 

వెంటనే పోలీసులు దర్యాప్తు జరిపి నిందితుని పట్టుకుని బాధితురాలికి న్యాయం చేయాలని కాదంబరి త్రిపాఠి డిమాండ్‌ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్సై అభిమన్యు దుర్గ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటుŠల్‌ సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఆమొ ఘొరొ సభ్యురాలు మాయా రాణి పాత్రో తదితరులున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement