4జీ, వాట్సాప్ కోసం బోయ్ ఫ్రెండ్ను ఉతికేసింది | Girl thrashes her boyfriend for not giving Whatsapp 4G phone | Sakshi
Sakshi News home page

4జీ, వాట్సాప్ కోసం బోయ్ ఫ్రెండ్ను ఉతికేసింది

Aug 25 2016 9:24 AM | Updated on Jul 12 2019 3:07 PM

4జీ, వాట్సాప్ కోసం బోయ్ ఫ్రెండ్ను ఉతికేసింది - Sakshi

4జీ, వాట్సాప్ కోసం బోయ్ ఫ్రెండ్ను ఉతికేసింది

తాను కోరినట్లుగా వాట్సాప్ ఉన్న 4జీ ఫోన్ ఇవ్వనందుకు ఓ గర్ల్ ఫ్రెండ్ తన బోయ్ ఫ్రెండ్ను ఉతికి ఆరేసింది.

ఆగ్రా: తాను కోరినట్లుగా వాట్సాప్ ఉన్న 4జీ ఫోన్ ఇవ్వనందుకు ఓ గర్ల్ ఫ్రెండ్ తన బోయ్ ఫ్రెండ్ను ఉతికి ఆరేసింది. నలుగురు చూస్తున్నారని కూడా పట్టించుకోకుండా నడిరోడ్డుపై అతడిపై విచక్షణ కోల్పోయి చేయి చేసుకొంది. ఆగ్రాలో చోటుచేసుకున్న ఈ ఘటన చూసి చుట్టుపక్కల వారు నోరెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళితే.. ఒకమ్మాయికి పాత నోకియా ఫోన్ ఉంది. ఆమెకు ఒక బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడు ఈ మధ్య తనకు నైనిటాల్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం వచ్చిందని గర్ల్ ఫ్రెండ్ కు చెప్పాడు. వెంటనే ఆ అమ్మాయి తనకు వాట్సాప్ ఉన్న ఒక 4జీ స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వాలని కోరింది.

దీనికి కాస్తంత సంకోచించిన అతడు తాను నైనిటాల్ వెళ్లాక అక్కడి నుంచి పంపిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య నడిరోడ్డుపై వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే ఆ అమ్మాయి అతడిపై చేయిచేసుకుంది. కాలితో తన్నుతూ చొక్కాపట్టుకొని ఆ చెంపాఈ చెంపా వాయించి నానా రచ్చ చేసింది. చివరకు అక్కడ ఉన్నవారు వారి విషయంలో జోక్యం చేసుకొని సర్దుమణిగేలా చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. తల్లిదండ్రులను పిలిచి విషయం చెప్పారు. అనంతరం వారితో పంపించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement