
మోడల్ ను పెళ్లాడిన సింగర్
ప్రముఖ గాయకుడు, కంపోజర్ బెన్నీ దయాల్ ఓ ఇంటివాడయ్యాడు.
బెంగళూరు: ప్రముఖ గాయకుడు, కంపోజర్ బెన్నీ దయాల్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు, మోడల్ కాథరిన్ థాంగమ్ ను బెంగళూర్ లో శనివారం వివాహం చేసుకున్నాడు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు ఏఆర్ రహమాన్, విశాల్ దయానీ లు హాజరయ్యారు.
బెన్నీ వివాహ చిత్రాలను విశాల్ దయాని ట్వీటర్ లో పోస్టు చేశాడు. బెన్నీ స్టుడెంట్ ఆఫ్ ద ఇయర్, బాంగ్ బాంగ్, రేస్-2 చిత్రాలకు సంగీతం అందించాడు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం భాషాల్లో అనేక పాటలు పాడారు.