
ప్రపోజ్ చేద్దామని...
గర్ల్‌ఫ్రెండ్ ముందు మోకాళ్లపై కూర్చొని ‘విల్ యూ మ్యారీ మీ’ అంటూ ప్రపోజ్ చేయడం కామన్.
గర్ల్‌ఫ్రెండ్ ముందు మోకాళ్లపై కూర్చొని ‘విల్ యూ మ్యారీ మీ’ అంటూ ప్రపోజ్ చేయడం కామన్. అందరూ చేసేదే. అందులో థ్రిల్లు ఏముంటుంది? అని ఆలోచించాడు చైనాలోని యిచాంగ్ నగరానికి చెందిన ఓ యువకుడు. భిన్నంగా చేయాలని ఆలోచించి... నింగి నుంచి ప్యారాచూట్‌తో గర్ల్‌ఫ్రెండ్ ముందు దిగి సర్‌ప్రైజ్ ప్రపోజ్ చేయాలని డిసైడయ్యాడు. పైగా ప్యారాచూట్‌పై ఓవైపు ప్రేయసి పేరుతో పాటు ‘నన్ను పెళ్లి చేసుకోవా’ అని కూడా రాయించాడు.
ప్రేయసిని పార్కుకు రమ్మని అద్దెకు తీసుకున్న విమానం నుంచి ప్యారాచూట్‌తో దూకేశాడు. అయితే మనోడి టైం బాగాలేక బలమైన గాలులు రావడంతో ఇదిగో ఇలా ఓ చెట్టుపై ల్యాండ్ అయ్యాడు. దెబ్బలేమీ తగలకపోయినా ఓ గంటపాటు పైనే ఉండిపోవాల్సి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి క్రేన్ సహాయంతో కిందకు దించారు. దిగిన వెంటనే మనోడు చేతిలో బొకే పట్టుకొని... ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. ఇంత సీన్ క్రియేట్ చేయడంతో అమ్మడుకి చిర్రెత్తుకొచ్చి... బదులివ్వకుండానే వెనుదిరిగి విసవిసా వెళ్లిపోయిందట.