
కిసుక్కు
వ్రతం...
ఆండాళు: పంతులుగారూ! ఇంట్లో సుఖశాంతుల కోసం ఏ వ్రతం చేయాలంటారు..?
పంతులు: మౌనవ్రతం చేయి.. చాలు!
అన్నీ మానేయ్!
రోగి: డాక్టర్ గారూ! మందు, సిగరెట్లు, అమ్మాయిలతో తిరగడం మానేస్తే నేను ఎక్కువకాలం బతుకుతా నంటారా?
డాక్టర్: అదేం కాదు, అన్నీ మానేస్తే ఎక్కువకాలం బతికినట్లు నీకనిపిస్తుందంతే!
ఆనందం...
వెంగళ్రావు: సార్ మా ఆవిడ కనిపించకుండా పోయింది..
పోస్ట్‌మాస్టర్: ఏమయ్యా! కళ్లు కనిపించడం లేదా? ఇది పోస్టాఫీసు.. పోయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చెయ్యి.
వెంగళ్రావు: సారీ సార్..! ఆనందం తట్టుకోలేక ఏది పోస్టాఫీసో, ఏది పోలీస్‌స్టేషనో తెలుసుకోలేకపోయా...
మా ఇంట్లోనే...
డోసుబాబు తూలుకుంటూ వెళుతుంటే, పోలీసు అటకాయించాడు..
పోలీసు: ఎక్కడికెళ్తున్నావు?
డోసుబాబు: తాగుడు వల్ల తలెత్తే అనర్థాల గురించి ఉపన్యాసం వినడానికి వెళ్తున్నా..
పోలీసు: ఇంత అర్ధరాత్రి వేళ ఉపన్యాసం ఇచ్చేదెవరు?
డోసుబాబు: ఇంట్లో మా ఆవిడ!
చాక్లెట్ ఇస్తే...
లెక్కల టీచర్: చింటూ..! నీ దగ్గర 12 చాక్లెట్లు ఉన్నాయనుకో.. వాటిలో 5 ప్రియాకి, 3 అనితకి, 2 కవితకి ఇచ్చావనుకో.. ఇంకా నీకేం ఉంటాయి..?
చింటూ: ముగ్గురు కొత్త గర్ల్‌ఫ్రెండ్స్ టీచర్..!