Malvika Raaj From K3G To Marry Businessman Pranav Bagga, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Malvika Raaj Marriage: లవ్‌ మ్యారేజ్‌ చేసుకోనున్న మాళవిక.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!

Aug 4 2023 2:53 PM | Updated on Aug 4 2023 3:07 PM

Malvika Raaj From K3G To Marry Businessman Pranav Bagga - Sakshi

కభీ ఖుషీ కభీ ఘమ్‌లో  పూజా పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మాళవిక రాజ్. ఈ చిత్రం 2001లో రిలీజ్‌ కాగా.. సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టనుంది ముద్దుగుమ్మ.  ప్రముఖ వ్యాపారవేత్త ప్రణవ్ బగ్గాతో పెళ్లికి రెడీ అయిపోయింది. టర్కీలో ప్రియుడు ప్రపోజ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్ని పంచుకుంది. ఇద్దరు జంటగా దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అఫీషియల్‌గా ప్రకటించింది. 

(ఇది చదవండి: ఒక్క సినిమా.. నాలుగు భాషలు.. ఐదుగురు స్టార్స్!)

ఇన్‌స్టాలో మాళవిక రాస్తూ..' మేము మేము త్వరలోనే కొత్త ప్రపంచంలో అడుగుపెట్టబోతున్నాం. చాలా కాలం తర్వాత మాకు సమయం వచ్చింది.  ఈ బంధంతో మేము ఇంకా బలంగా తయారయ్యాం.' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, స్నేహితులు కాబోయే జంటకు అభినందనలు తెలిపారు.  అవంతిక దస్సాని, స్టెబిన్ బెన్‌తో సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మాళవిక, ప్రణవ్ పెళ్లి ఎప్పుడనే మాత్రం వెల్లడించలేదు.

కాగా.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కరణ్ జోహార్ తెరకెక్కించిన 'K3G' అనే చిత్రంలో కరీనా కపూర్ ఖాన్ పాత్రను మాళవిక పోషించింది. అంతే కాకుండా ఆమె 2017లో వచ్చిన చిత్రం జయదేవ్‌లో కూడా కనిపించింది.  ఆ తర్వాత ఆమె 'స్క్వాడ్' అనే చిత్రంలో రిన్జింగ్ డెంజోంగ్పా సరసన ప్రధాన పాత్ర పోషించింది. మాళవిక ప్రముఖ బాలీవుడ్ నటుడు జగదీశ్ రాజ్ మనవరాలు, బాబీ రాజ్ కుమార్తె.  అంతేకాకుండా ప్రముఖ నటి అనితా రాజ్ మేనకోడలు కూడా.

(ఇది చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement