
ప్రేమ కథలన్నీ పెళ్లి పీటలెక్కవు, కొందరి ప్రేమ మాత్రమే పెళ్లి బంధం వరకు రాగలుగుతుంది. ఓ అమ్మాయి కూడా తన ప్రేమ పెళ్లితో మరింత బలపడాలని కలలు కంది. ఇద్దరి గుర్తుగా ఓ బిడ్డను కూడా కంది. కానీ ఎనిమిదేళ్లవుతున్నా ప్రియుడి నోటి వెంట ఒక్కసారి కూడా పెళ్లి చేసుకుందాం అన్న మాట రాలేదు. దీంతో ఓపిక నశించిన ఆ యువతి పెళ్లంటే ముఖం చాటేస్తున్న బాయ్‌ఫ్రెండ్‌పై ఏకంగా కోర్టులో దావా వేసింది. ఈ ఘటన జాంబియా దేశంలో చోటు చేసుకుంది. గెర్టూడ్ నోమా(26), హెర్బర్ట్ సలాలికి(28) ఎనిమిదేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. వీరికి ఓ బిడ్డ కూడా పుట్టింది. ఈ సందర్భంగా మహిళ తల్లిదండ్రులు అతడికి వరకట్నం ఇచ్చారు. ఎనిమిదేళ్ల అనుబంధంలో అతడు ఒక్కసారి కూడా పెళ్లి ఊసెత్తలేదు. (చదవండి: 2020లో మోత మోగిన పాపులర్ ట్వీట్స్ ఇవే!)
దీంతో విసుగు చెందిన యువతి ఈ విషయాన్ని ఎలాగైనా తేల్చుకోవాలని కోర్టుకెక్కింది. "అతడు దేన్నీ సీరియస్‌గా తీసుకోవడం లేదు. గతంలో ఎప్పుడో నా వేలికి ఉంగరం తొడుగుతానని మాటిచ్చాడు. కానీ అది ఇంతవరకు జరగలేదు. ఇంతకాలం తన సమయాన్ని వృధా చేశాడు. చూస్తుంటే అతడు నన్ను మోసం చేస్తున్నాడేమోనన్న అనుమానం వస్తోంది. అందుకే నా భవిష్యత్తు ఏంటో తెలుసుకునేందుకు అతడిని కోర్టుకీడ్చాను" అని చెప్పుకొచ్చింది. ఆమె ప్రియుడు సలాలికి మాట్లాడుతూ ఆవిడే తనను సరిగా పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. ఇద్దరి మాటలు విన్న న్యాయమూర్తి ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇక్కడివరకు రావాల్సిన అవసరం లేదని చెప్పారు. దీన్ని కోర్టు బయటే పరిష్కరించుకొమ్మని సూచించారు. అయితే సదరు ప్రియుడికి కుటుంబాన్ని పోషించే స్థోమత లేనందువల్లే పెళ్లికి వెనకడుగు వేస్తున్నాడట. (చదవండి: ‘ఏలియన్స్ ఉన్నాయి.. నిరూపిస్తాను’)
Comments
Please login to add a commentAdd a comment