ప్రపోజ్ చేయాలంటే ప్రిపేర్ కావాలి!
ఒక అమ్మాయిని మెప్పించడమంటే పదిమంది బాసులను మెప్పించడంతో సమానం. చక్కగా పనిచేసి, బుద్ధిగా మాట వింటే బాస్‌కు చాలు. కానీ అమ్మాయికి అలాకాదు, అబ్బాయి అష్టవిధ అవతారాలు ఎత్తాలి, నవరసాలు పోషించాలి, లాలించాలి, పాలించాలి, మెప్పించాలి... ఆ తర్వాత గాని ఏదీ ఒప్పుకోరు. ప్రేమలో పడిన యువకుల ప్రేమకథకు... ప్రపోజ్ చేసే సీన్ ఇంటర్వెల్ వంటిది. అంటే ఒకమ్మాయిని పడేయడం అన్నది తర్వాత అసలు ప్రపోజ్ చేయడానికి ప్రిపేర్ కావాలంటేనే అంత సమయం పడుతుంది. దానికి ఎంత ప్రిపరేషన్ ఉండాలి, ఎంత సృజనాత్మకత ఉండాలి... ఎంత సౌమ్యత ఉండాలి. ఇవన్నీ ఒక్క ప్రేమలో పడినోడికే సాధ్యం. అవేవీ మిస్ కాకుండా, ప్రేయసి హర్ట్ కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
మీరు ప్రపోజ్ చేస్తున్న విషయం ఆమెకు ఇష్టం లేని వారికి తెలియకూడదు. అమ్మాయికి అది అందరికీ తెలియడం ఇష్టం ఉందు.
ఒకే మనిషి ఎపుడూ ఒకేలా ఉండరు. ఆ రోజు కాస్త ఖర్చయినా పర్లేదు... జుట్టు నుంచి షూ దాకా ఎక్కడా రాజీ పడకుండా ఒంటిని బ్రాండ్లతో నింపేయండి. మరీ అతి కాకుండా సింపుల్‌గా, సూపర్‌గా ఉండేలా చూసుకోండి. దీనికి ఇంటర్నెట్ హెల్ప్ తీసుకోండి.
{పపోజ్ చేయడానికి పిక్నిక్ స్పాట్, సముద్ర తీరం, ఇతరుల డిస్టర్బెన్స్ లేని విశాలమైన, కాస్త ఖరీదైన హాయిగొలిపే రెస్టారెంట్, మల్టీ నేషనల్ కేఫ్ (ఇది ఉదయం పూటే) మంచి ప్రదేశాలు. మీ ప్రేమ ప్రతిపాదనకు స్పందన మరోలా ఉన్నా ఇద్దరూ అల్లరి కాకుండా ఉండేందుకు ఈ ప్రదేశాలు మంచివి. ఇరుకైన వాటికి వెళ్లకండి.
ముద్దుగా ఉండి, కొంచెం ఖరీదైన బహుమతి తీసుకెళ్లండి. అంగీకరిస్తే ప్రేమను అంగీకరించినందుకు ఇవ్వండి, అంగీకరించకపోతే మిమ్మల్ని గాయపరిచినందుకు ఈ బహుమతితో క్షమాపణ చెప్పండి. ఇది పునరాలోచన చేసేలే చేయొచ్చు కదా. బహుమతి జేబులో పెట్టుకుని వెళ్లేంత చిన్న సైజులో ఉంటే బెటర్.
ఆ రోజు మాట్లాడే విషయాలు మాత్రం ఎంతో ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఒక పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్‌లా ఉండాలి.
అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీరు ప్రపోజ్ చేసే సమయానికి మీరు ఆమెను ఇష్టపడుతున్నట్లు ఆమెకు తెలిసి ఉండాలి. అయితే, అది ప్రేమా, క్రేజా అన్న స్పష్టత ఉండక్కర్లేదు.