Valentine Week 2022: Teddy Day Significance And Special Story In Telugu - Sakshi
Sakshi News home page

Teddy Day 2022: టెడ్డీ డే..అసలా ఆ కెమిస్ట్రీ ఏంటి?

Published Thu, Feb 10 2022 10:32 AM | Last Updated on Thu, Feb 10 2022 11:33 AM

Valentines day Week: Teddy day significance and love - Sakshi

అందమైన అమ్మాయి..ఆమె చేతిలో క్యూట్‌ క్యూట్‌ టెడ్డీ.  ప్రేమికుల వారోత్సవాల్లో భాగంగా టెడ్డీ డే రోజు కనిపించే దృశ్యాలివే.  నాలుగో రోజు ఫిబ్రవరి 10న  టెడ్డీ డే‌గా జరుపుకుంటారు.  అసలు ప్రేమికులకు ఈ టెడ్డీకి మధ్య ఉన్న  కెమిస్ట్రీ ఏంటి?  ఈ రోజు ఎందుకు టెడ్డీ బేర్ గిఫ్టుగా ఇస్తారు. మీ వాలెంటైన్‌కి ఎలాంటి టెడ్డీ సూట్‌ అవుతుంది. వైట్‌.. రెడ్‌ ఎలాంటి టెడ్డీ ఇస్తే లవ్‌ ఈజ్‌ ఇన్‌ ద ఎయిర్‌ అనిపిస్తుంది... లెట్స్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ.

ప్రేమను గిఫ్ట్‌లతో కొలవలేం కానీ, పెద్దదైనా, చిన్నదైనా ఎప్పుడైనా సరే గిఫ్ట్ ప్రేమను పంచుతుంది. పెంచుతుంది కూడా. ప్రేమను చాటడమే దాని ఉద్దేశం. ప్రేమికుల వారంలో భాగంగా నాలుగో రోజు ఫిబ్రవరి 10న టెడ్డీ డే గా వ్యవహరిస్తాం. ప్రేమికుల మధ్య ప్రేమను చాటేందుకు టెడ్డీ డే రోజున అబ్బాయిలు అమ్మాయిలకు టెడ్డీ బేర్‌ను ఇస్తారు. ఒక విధంగా చెప్పాలంటే చిన్నప్పటినుంచి అమ్మాయిలకు కూడా టెడ్డీ బేర్ అంటే ప్రాణం. తమకలవాటైన టెడ్డీ లేకుండా క్షణం కూడా నిద్రపోని అమ్మాయిలున్నారంటే అతిశయోక్తి కాదు.

Valentines Day 2022

అమ్మాయిలు టెడ్డి బేర్స్‌ని ఎక్కువగా ఇష్టపడటం వెనుక కొన్ని మానసిక కారణాలు ఉన్నాయి. తమకు తోడుగా, అండగా మరో మనిషి ఉన్నారనే భరోసా  వారికి చాలా ధైర్యాన్నిస్తుంది. అలా ఒంటరితనాన్ని పోగొట్టుకుంటారు. తన ప్రేయసికి సరిగ్గా ఇలాంటి సపోర్ట్‌ ఇచ్చేందుకే ఏ అబ్బాయైనా టెడ్డీని బెస్ట్‌ గిఫ్ట్‌గా ఎంచుకుంటాడు. 24/7 నేను నీతోనే..నీ పక్కనే అంటూ తన కలల రాణికి ధైర్యం చెబుతాడన్నమాట. తమ పెయిన్‌, గెయిన్‌ ఏదైనా టెడ్డి బేర్స్‌కు మాత్రమే చెబుతారు. ఎందుకంటే ఏ టెడ్డీ నెవర్‌ బ్రేక్స్‌ ద రూల్‌ అండ్‌ నెవర్‌ ​ బ్రేక్స్‌ అప్‌ ది రిలేషన్‌.

 Valentines Week Teddy Day

మరి ఎలాంటి టెడ్డీ ఇస్తే.. మీ కరెక్ట్‌ ఫీలింగ్‌ కన్వే అవుతుందో తెలుసా. రెడ్ టెడ్డీ బేర్ ఇస్తే.. లవ్‌ ఈజ్‌ ఇన్‌ ద ఎయిర్‌ అని అర్థం. పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తున్నట్టు అర్థం. ఇక పింక్‌ గులాబీ రంగు టెడ్డీతో  ఇస్తే అవతలి వాళ్ల  ప్రేమను  హార్ట్‌ఫుల్‌గా స్వీకరించినట్టు. ఇక పవర్‌కి, హ్యాపీనెస్‌కి  గుర్తు  ఆరెంజ్.  కాబట్టి, త్వరలోనే  ఎవరికైనా ప్రపోజ్ చేయాలి అనుకుంటే  టెడ్డీ డే రోజున ఆరెంజ్ టెడ్డీ ఇచ్చేయొచ్చు. బ్లూ టెడ్డీని బహుమతి ఇచ్చి పిచ్చి పిచ్చిగా ప్రేమించడమే కాదు..నువ్వు నా పక్కన ఉండటం అదృష్టం అని గట్టిగా చెప్పేసినట్టే. గ్రీన్ టెడ్డీ వెయిటింగ్‌ ఫర్‌ యూ అని చెప్పడం. టెడ్డీ డే రోజున బ్రౌన్ టెడ్డీ  ప్రేమించిన వ్యక్తి గుండెను బద్దలు చేశారన్న బాధకు చిహ్నం. లాస్ట్‌ బట్‌ నాట్‌ ద లీ స్ట్‌.  ప్రేమికులకు మాత్రం టెడ్డీ డే రోజున  వైట్‌ టెడ్డీ అంత గుడ్‌ సింబల్‌ కాదు. ఆల్రెడీ వారు వేరే వ్యక్తితో లవ్‌లో ఉన్నట్టు అర్థం.  సో.. సిల్కీ అండ్‌ స్మూదీ టెడ్డీ బేర్‌తో  మీ ట్రూ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్‌ చేయండి.. హ్యాపీ టెడ్డీ డే.

Teddy Day 2022

Teddy Day 2022 Significance

అరుదైన సందర్భాల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలకు ఇస్తుంటారు. సాధారణంగా క్యూట్‌ యానిమల్స్ బొమ్మల్ని, లేదా హార్టీ టెడ్డీ బేర్‌ను గిఫ్టుగా ఇస్తారు. అయితే ఎంత ఖరీదైన బహుమతి ఇచ్చామన్నది కాదు, ప్రేమను ఎలా వ్యక్తం చేశామన్నదే ముఖ్యం. వాలెంటైన్స్‌ వీక్‌లో టెడ్డీ డే తర్వాత  ఫిబ్రవరి 11న హ్యాపీ ప్రామిస్ డే, 12న హ్యాపీ హగ్ డే, 13న హ్యాపీ కిస్ డే జరగనుంది.  చివరగా14న హ్యాపీ వాలెంటైన్స్ డే జరుపుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement