ప్రతీకాత్మక చిత్రం
వాలెంటైన్స్ డేకు మరో ఒక రోజు మాత్రమే ఉంది. ఈ వాలెంటైన్స్ వీక్‌లో ముఖ్యమైన, ప్రత్యేకమైనది ‘హగ్ డే’... ఈ రోజున ప్రియమైన వారికి మనమిచ్చే కానుకు ప్రత్యేకమైనది. ఇది వస్తువు రూపంలో లేకపోయినా ఎదుటి వ్యకికి ఎంతో సంతోషాన్నిస్తుంది.. ఓ చిరకాల జ్ఞాపకంగా వారి మనసుల్లో మిగిలిపోతుంది. కోటి మాటలు ఓ కౌగిలింతకు సరికావు! ఎదుటి వ్యక్తిపై మనకున్న ప్రేమను వ్యక్త పరచడానికి ఇంతకన్నా మంచి మార్గం ఇంకోటి లేదని చెప్పొచ్చు. ఓ బలమైన కౌగిలింత ద్వారా ఎదుటివ్యక్తిని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో చెప్పకనే చెప్పొచ్చు. ఎంత డబ్బు ఖర్చు చేసినా పొందలేని ఆనందం దీని సొంతం.
కౌగిలింతతో లాభాలెన్నో..
కౌగిలింతతో మన ప్రేమను వ్యక్తపర్చటమే కాదు. దీని వల్ల మానసికంగా, శారీరకంగా మనకు ఎన్నో లాభాలున్నాయి.
1) మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా ఓ సారి ప్రియమైన వారి కౌగిలింతలోకి చేరితో ఆ బాధ ఇట్టే దూరమైపోతుంది.
2) కౌగిలింత కారణంగా మన పనితనం మెరుగుపడుతుంది.
3) కౌగిలింత ‘బిహేవియరల్ మెడిసిన్’గా పనిచేస్తుంది. సభల్లో మాట్లాడటానికి ఇబ్బంది పడేవాళ్లకు ఇది చక్కటి ఔషదంలా మారుతుంది. ఓ 20 సెకన్ల కౌగిలింత వారి హార్ట్‌బీట్ రేటును తగ్గించి చక్కగా మాట్లాడేలా చేస్తుంది.
4) ఓ బలమైన కౌగిలింత ఒత్తిడికి కారణమైన కార్టిసాల్ హార్మోన్‌ను తగ్గిస్తుంది.
5) ఓ కౌగిలింత జంట మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఎందుకంటే కౌగిలింత ద్వారా వ్యక్తుల శరీరాల్లో విడుదలయ్యే ‘ఆక్సిటోసిన్’ అనే హార్మోన్ ఇందుకు కారణం. అంతేకాకుండా ఈ హార్మోన్ కారణంగా గుండె పనితీరు కూడా మెరుగు పడుతుంది.
6) కౌగిలింత నొప్పిని తగ్గించే మందులా కూడా పనిచేస్తుంది. కౌగిలింత ద్వారా విడుదలయ్యే ఎండార్ఫిన్ అనే హార్మోన్ నొప్పులను తగ్గిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment