ప్రతీకాత్మక చిత్రం
ప్రేమ ఎవ్వరినైనా పిచ్చి వాళ్లను చేయగలదు. ప్రేమ మత్తులో ఒక్కసారి మునిగితే బయటకు రావడం అంత సులభం కాదు. ప్రేమ ఎవ్వరినైనా ఎదురించేలా చేయగలదు, రాజ్యాన్ని సైతం త్యజించేలా చేయగలదు. అలాంటి ప్రేమ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అలాంటి భావాల్ని వ్యక్తపరచాలంటే మాటలు పాటల్లా మారాల్సిందే. కొందరు ‘నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావా మరి’ అని ప్రేయసిని బ్రతిమిలాడుకుంటే.. ఇంకొందరు ‘ఉంగరాల జుట్టు వాడ్ని ఒడ్డు పొడుగు ఉన్నవాడ్ని చేరి నిన్ను కోరుకుంటే చౌకబేరమా’ అంటూ ప్రేమలో పడేస్తున్నారు. ప్రేమను వ్యక్త పరచడంలో, ఆ ప్రేమను ఫీలవ్వడంలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు. అందుకే ఇప్పటికే ప్రేమ మీద వేల కొద్ది పాటలు వచ్చినా ఇంకా అనేక పాటలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటిలో అందమైన ఆకట్టుకునే కొన్ని పాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
ప్రేమికుల రోజు నాడు కచ్చితంగా మనకు గుర్తొచ్చే పాట ప్రేమికుల రోజు సినిమాలోని ‘వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన! నా ప్రాణమిచ్చుకోన.. నీ రూపు చూసి శిలను అయితినే.. ఓ మాట రాక మూగబోతినే’. ప్రేమించే ప్రతి అబ్బాయి తన ప్రేయసి గురించి ఇలా ఫీలవుతూనే ఉంటాడు. ఇక అమ్మాయిలు‘ మన్మధుడా నీ కల కన్నా.. మన్మధుడా నీ కథ విన్న మన్మధుడంటే ప్రాణంలే మన్మధుడే నాక్కావలలే’ అంటూ మురిసిపోతూ ఉంటారు. ‘ఫీల్ మై లవ్’ అంటూ మీ ప్రేమను ఫీలయ్యేలా చేసిన తరువాత ‘నిజంగా నేనే నా....ఇలా నీ జతలో ఉన్నా’ అంటూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. ప్రేమించిన అమ్మాయి ఒక్కరోజు కనబడకపోతే చాలు ‘పిల్లారా!.. నువ్వు కనపడవా’ అంటూ ప్రాణం పోతున్నట్లు విలవిలలాడిపోతారు. అంత బాధ తరువాత తను ఒక్కసారి కనిపిస్తే చాలు ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...చాలే ఇది చాలే’ అంటూ ఎగిరి గంతెస్తాం.
మన ప్రేమ ప్రయాణంలో ఏ పాట విన్నా, ఏ సినిమా చూసినా మనం ప్రేమించిన వారే కనబడతారు. ప్రపంచం అంతా ప్రేమమయం అనిపిస్తుంది. అందుకే ప్రేమ, పాట ఒక చక్కని జోడి. ఎన్నో భావాలను అందంగా తెలియజేయడానికి పాట ఒక సాధనం. అందుకే ప్రేమికుల రోజున మీకు నచ్చిన వారికి మనసుకు హత్తుకునే పాటను షేర్ చేస్తూ మీ ప్రేమను వ్యక్త పరచండి. మీ కోసం మాకు తెలిసిన కొన్ని అందమైన పాటల్ని కొన్నింటిని మీతో పంచుకుంటున్నాం.
-- నన్నుదోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి - గులేబకావళి కథ
-- నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావా మరి-- నా హృదయంలో నిదురించే చెలి
-- ఈ హృదయం కరిగించి వెళ్లకే -ఏ మాయ చేశావే
-- కన్నల్లో నీ రూపమే గుండెల్లోనీ ధ్యానమే- నిన్నే పెళ్లాడతా
-- మధురమే మధురమే మధురమే --సత్యం
-- నువ్వేప్పుడొచ్చావో అపుడే పుట్టింది ఈ ప్రేమ - అమ్మాయిలు అబ్బాయిలు
-- నా గుండెలో నువ్వుండి పోవా - నువ్వు నేను
-- ఓ చెలియ నా ప్రియ సఖియా చేజారేను నా మనసే- ప్రేమికుడు
-- తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలిక -సొంతం
-- తెలియదులే ఇది తెలియదులే - సింగం
-- ప్రియతమా ప్రియతమా.. పలికినది హృదయమే సరిగమా -మజిలీ
-- నీ జతగా నేనుండాలి, నీ యదలో నేనిండాలి - ఎవడు
-- మెల్లగా కరగని రెండు మనసుల దూరం - వర్షం.
-- బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే - అల వైకుంఠపురం.
-- నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. మబ్బులు నిన్ను కమ్మేస్తాయని మౌనంగా ఉన్నా.. - 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?..
ఇలా పది కాదు వంద కాదు ప్రేమ మీద వేల కొద్ది పాటలు ఉన్నాయి. మీకు నచ్చిన ఒకపాటను ప్రేమికుల రోజు సందర్భంగా మీరు ప్రేమించే వాళ్లకు అంకితమివ్వండి. కమ్మని పాటలా మీరు కూడా కలకాలం గుర్తుండిపోతారు.
Comments
Please login to add a commentAdd a comment