Love songs
-
ప్రేమలో ఉన్న వారికి కచ్చితంగా గుర్తొచ్చేవి!
ప్రేమ ఎవ్వరినైనా పిచ్చి వాళ్లను చేయగలదు. ప్రేమ మత్తులో ఒక్కసారి మునిగితే బయటకు రావడం అంత సులభం కాదు. ప్రేమ ఎవ్వరినైనా ఎదురించేలా చేయగలదు, రాజ్యాన్ని సైతం త్యజించేలా చేయగలదు. అలాంటి ప్రేమ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అలాంటి భావాల్ని వ్యక్తపరచాలంటే మాటలు పాటల్లా మారాల్సిందే. కొందరు ‘నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావా మరి’ అని ప్రేయసిని బ్రతిమిలాడుకుంటే.. ఇంకొందరు ‘ఉంగరాల జుట్టు వాడ్ని ఒడ్డు పొడుగు ఉన్నవాడ్ని చేరి నిన్ను కోరుకుంటే చౌకబేరమా’ అంటూ ప్రేమలో పడేస్తున్నారు. ప్రేమను వ్యక్త పరచడంలో, ఆ ప్రేమను ఫీలవ్వడంలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు. అందుకే ఇప్పటికే ప్రేమ మీద వేల కొద్ది పాటలు వచ్చినా ఇంకా అనేక పాటలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటిలో అందమైన ఆకట్టుకునే కొన్ని పాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రేమికుల రోజు నాడు కచ్చితంగా మనకు గుర్తొచ్చే పాట ప్రేమికుల రోజు సినిమాలోని ‘వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన! నా ప్రాణమిచ్చుకోన.. నీ రూపు చూసి శిలను అయితినే.. ఓ మాట రాక మూగబోతినే’. ప్రేమించే ప్రతి అబ్బాయి తన ప్రేయసి గురించి ఇలా ఫీలవుతూనే ఉంటాడు. ఇక అమ్మాయిలు‘ మన్మధుడా నీ కల కన్నా.. మన్మధుడా నీ కథ విన్న మన్మధుడంటే ప్రాణంలే మన్మధుడే నాక్కావలలే’ అంటూ మురిసిపోతూ ఉంటారు. ‘ఫీల్ మై లవ్’ అంటూ మీ ప్రేమను ఫీలయ్యేలా చేసిన తరువాత ‘నిజంగా నేనే నా....ఇలా నీ జతలో ఉన్నా’ అంటూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. ప్రేమించిన అమ్మాయి ఒక్కరోజు కనబడకపోతే చాలు ‘పిల్లారా!.. నువ్వు కనపడవా’ అంటూ ప్రాణం పోతున్నట్లు విలవిలలాడిపోతారు. అంత బాధ తరువాత తను ఒక్కసారి కనిపిస్తే చాలు ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...చాలే ఇది చాలే’ అంటూ ఎగిరి గంతెస్తాం. మన ప్రేమ ప్రయాణంలో ఏ పాట విన్నా, ఏ సినిమా చూసినా మనం ప్రేమించిన వారే కనబడతారు. ప్రపంచం అంతా ప్రేమమయం అనిపిస్తుంది. అందుకే ప్రేమ, పాట ఒక చక్కని జోడి. ఎన్నో భావాలను అందంగా తెలియజేయడానికి పాట ఒక సాధనం. అందుకే ప్రేమికుల రోజున మీకు నచ్చిన వారికి మనసుకు హత్తుకునే పాటను షేర్ చేస్తూ మీ ప్రేమను వ్యక్త పరచండి. మీ కోసం మాకు తెలిసిన కొన్ని అందమైన పాటల్ని కొన్నింటిని మీతో పంచుకుంటున్నాం. -- నన్నుదోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి - గులేబకావళి కథ -- నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావా మరి-- నా హృదయంలో నిదురించే చెలి -- ఈ హృదయం కరిగించి వెళ్లకే -ఏ మాయ చేశావే -- కన్నల్లో నీ రూపమే గుండెల్లోనీ ధ్యానమే- నిన్నే పెళ్లాడతా -- మధురమే మధురమే మధురమే --సత్యం -- నువ్వేప్పుడొచ్చావో అపుడే పుట్టింది ఈ ప్రేమ - అమ్మాయిలు అబ్బాయిలు -- నా గుండెలో నువ్వుండి పోవా - నువ్వు నేను -- ఓ చెలియ నా ప్రియ సఖియా చేజారేను నా మనసే- ప్రేమికుడు -- తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలిక -సొంతం -- తెలియదులే ఇది తెలియదులే - సింగం -- ప్రియతమా ప్రియతమా.. పలికినది హృదయమే సరిగమా -మజిలీ -- నీ జతగా నేనుండాలి, నీ యదలో నేనిండాలి - ఎవడు -- మెల్లగా కరగని రెండు మనసుల దూరం - వర్షం. -- బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే - అల వైకుంఠపురం. -- నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. మబ్బులు నిన్ను కమ్మేస్తాయని మౌనంగా ఉన్నా.. - 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?.. ఇలా పది కాదు వంద కాదు ప్రేమ మీద వేల కొద్ది పాటలు ఉన్నాయి. మీకు నచ్చిన ఒకపాటను ప్రేమికుల రోజు సందర్భంగా మీరు ప్రేమించే వాళ్లకు అంకితమివ్వండి. కమ్మని పాటలా మీరు కూడా కలకాలం గుర్తుండిపోతారు. -
అలాంటి గీతాలే గాయపడిన మనసుకు...
-
అలాంటి గీతాలే గాయపడిన మనసుకు...
మూగబోయిన మనిషి తన మనసు లోతుల్లో పాడుకునేదే ఈ విరహగీతం. అలాంటి గీతాలే గాయపడిన మనసుకు రాసే మందవుతాయి. హృదయాన్ని చీకటి లోతుల్లోంచి రంగుల పచ్చిక బయళ్లలోకి తీసుకొస్తాయి. నిజ జీవితాలే కాదు కొన్ని సినిమా గీతాలు వాస్తవాలను మైమరపిస్తూ.. అనుభవాల గుర్తులతో గుండె నిట్టూర్పు విడిచేలా చేస్తాయి. ఎడబాటు పల్లవై.. కన్నీరు చరణమై.. మనసు పలికే మౌనరాగం. విరహగీతం 1) ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంతకఠినం.. (అభినందన) 2) మాటరాని మౌనమిది..మౌనవీన గానమిది ( మహర్షి) 3) నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని.. ( నా ఆటోగ్రాఫ్) 4) ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా.. (ఆంధ్రుడు) 5) ప్రేమా.. ప్రేమా ఓ ప్రేమా.. పిలుపును వినవమ్మా( గోకులంలో సీత) 6) ఈ క్షణం ఒకే ఒక కోరిక.. నీ స్వరం వినాలని తియ్యగ ( ఎలా చెప్పను) 7) వెళ్లిపోవే.. వెళ్లిపోవే ( మేం వయసుకు వచ్చాం) 8) ఏం చెప్పను నిన్నేలా ఆపను (నేను శైలజా) 9) అది నన్నే నన్నే చేర వచ్చే చెంచలా.. (సూర్య సన్ఆఫ్ క్రిష్ణన్) 10) ప్రేమ లేదని ప్రేమించరాదని.. ( అభినందన) -
వన్‌సైడ్ లవ్వా? మీ కోసమే..
వన్‌సైడ్ లవ్‌లో ఉన్న చాలామంది తమ ప్రేమను ఎదుటి వారికి చెప్పటానికి సతమతమవుతుంటారు. రోజులు గడుస్తున్న కొద్ది వారిలో భయం, బాధా పెరిగిపోతుంటాయి. చెప్పలేక కొంత.. ఇక చెప్పలేమోనని మరికొంత అల్లాడిపోతుంటారు. ప్రతిక్షణం బాధపడుతూ.. మనసును బాధించుకుంటూ ఉంటారు. అలాంటి వారికోసం సంగీతం ఓ ఔషదంలా పనిచేస్తుంది. కొన్ని పాటలు గుండెలోని బాధను తరిమికొట్టి కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. అలాంటి 10 తెలుగు వన్‌సైడ్ లవ్ పాటలు మీకోసం.. మనసుకు హత్తుకునే 10 వన్‌సైడ్ లవ్ సాంగ్స్ : 1) కలలోనైన అనుకోలేదే నువ్వొస్తావని ( నువ్వస్తావని) 2) ఏ కొమ్మకాకొమ్మ గుంగొత్త రాగం ( శ్రీను ) 3) సుస్వాగతం నవరాగమా ( సుస్వాగతం) 4) ఇంకా ఏదో.. ఇంకా ఏదో.. ( డార్లింగ్ ) 5) మనసున ఉన్నది చెప్పాలనున్నది ( ప్రియమైన నీకు) 6) ఏదో ప్రియరాగం వింటున్నా.. ( ఆర్య) 7) నీ చూపులే దీపావళి (ఎందుకంటే ప్రేమంట) 8) సుమమ్ ప్రతి సుమమ్ సుమమ్ ( మహర్షి) 9) వేయి కన్నులతో వేచి చూస్తున్నా( నీ స్నేహం) 10) చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా..( ఏప్రిల్ 1 విడుదల) లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
యాప్స్‌తో ప్రేమ తీరు మారింది...
లండన్: యువ‘తరం’ మారింది. ప్రేమ తీరు మారింది. ఓ కలువ బాల, ఓ వెన్నెల రేడ! అంటూ యుగళ గీతాలు గుర్తుకు తెచ్చుకోవడం, నీ కోసమే నే జీవించునది, నీ కోసమే నే తపియుంచునది! అంటూ పరస్పరం పేజీలకొద్ది కవిత్వాలు రాసుకోవడం, చలం ‘ప్రేమ లేఖలు’ ఇచ్చి పుచ్చుకోవడం నిన్నటి తరంతోనే ముగిసిపోయింది. ప్రేమ పుస్తకాలకు, కవిత్వానికి, ప్రేమ పాటలకు ఈ తరంలో పూర్తిగా కాలం చెల్లిపోయిందని, వాటి స్థానాన్ని డేటింగ్ యాప్స్ ఆక్రమించాయని లండన్‌కు చెందిన ప్రముఖ చరిత్రకారులు లూజీ వర్సిలీ తెలియజేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో యువతీ యువకులు పరస్పర ప్రేమ సంబంధాల కోసం ‘టిండర్’ లాంటి డేటింగ్ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారని, టిండర్‌ను 2012లో ప్రారంభించగా, ఇప్పటికే ఐదు కోట్ల మంది ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని 41 ఏళ్ల లూజీ తెలిపారు. స్మార్ట్ ఫోన్ యాప్ టిండర్ జీపీఎస్ వ్యవస్థను ఉపయోగించడం వల్ల, తమకు కాబోయే భాగస్వామి వయస్సెంతో, ఎంత దూరంలో ఉన్నారో, చూడడానికి ఎలా ఉంటారోతదితర వివరాలను కచ్చితంగా తెలుసుకునేందుకు ఉపయోగపడుతోందని, అందుకనే ఇది డేటింగ్ యాప్స్‌లో ఎంతో ప్రాచుర్యం పొందుతోందని ఆమె చెప్పారు. ఈ యాప్‌ను ఉపయోగించడం వల్ల 24 గంటల్లో దాదాపు రెండున్నర కోట్ల మంది ప్రేమ జంటలవుతున్నారని, వారిలో 16 ఏళ్ల నుంచి 24 ఏళ్లలోపు యువతీ యువకులు 38 శాతం ఉండగా, 25 ఏళ్ల నుంచి 34 ఏళ్ల లోపువారు 45 శాతం మంది, 45 ఏళ్ల పైబడిన వారు కేవలం నాలుగు శాతం మంది ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలిందని లూజీ వివరించారు. ఈ యాప్ కారణంగా ఒక్కరోజు భార్యా భర్తలుగా గడిపిన వారు కూడా ఎక్కువే ఉన్నారని ఆమె అన్నారు. ప్రేమ పుస్తకాలను చదివే ఓపిక, తీరిక నేటి యువతరానికి లేకుండా పోయిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
గుప్పెడు పాటలు...గుండెనిండా పరిమళం!
లండన్ వాళ్లకు తమిళం తెలియదు. కాజీపేట వాళ్లకు ఫ్రెంచ్ అర్థం కాదు. ప్రాంతానికో భాష... దేశానికో భాష... కానీ, ప్రపంచమంతా అర్థం చేసుకునే భాష... ప్రేమ. మీరు ఏమైనా అనుకోండి... ఎంతైనా కామెంట్ చేసుకోండి... ప్రేమ వేల్యూ ప్రేమదే. సాహిత్యానికి, సినిమాకి ఈ ప్రేమే గొప్ప ఇంధనం. ప్రేమ పేరు చెప్పి ఎన్ని వేల పాటలొచ్చాయో! ముఖ్యంగా బాలీవుడ్లో... కానీ, ప్రస్తుతానికి ఓ పది పాటల గురించి మాట్లాడుకుందాం. ఆ పాటల్లో ప్రేమనంతా ఆస్వాదిద్దాం! ఆ ప్రేమ పరవళ్లలో కొట్టుకుపోదాం... ఎలాగూ మరో నాలుగు రోజుల్లో ప్రేమికుల రోజు ఉంది కదా! సినిమా పేరు: బైజూ బావరా (1952) ప్రేమ జంట: భరత్ భూషణ్, మీనాకుమారి స్వర సారథ్యం: నౌషాద్ అలీ సాహిత్యం: షకీల్ బాదాయుని గానం: మహమ్మద్ రఫీ తూ గంగాకీ మౌజ్.. మై జమునాకీ ధారా.. ప్రేయసి అలిగింది. అర్జంట్‌గా ప్రసన్నం చేసుకోవాలి. ప్రియుడి తొందరపాటు. ఇందుకు పాటకు మించిన అస్త్రం ఏముంటుంది! పాట మొదలైంది. ప్రియా.. ఈ దూరం మన అనుబంధాన్ని చెరిపేయగలదా? నువ్వెంత దూరం వెళ్లినా వెతుక్కుంటూనే వస్తాను. నీ అలకనంతా మాయం చేసి వలపు పుట్టేలా చేస్తాను... ఇలా సాగిపోయింది పాట. కరిగిపోవడం మినహా ఆ కలహంసకు వేరే దారి ఏముంటుంది! కమ్మటి ముద్దు... చక్కటి కౌగిలి మిగులుతాయి ప్రియుడికి. మీ ప్రేయసి అలక తీర్చడానికి మీరూ వాడొచ్చు... ఈ పాటను! ************** సినిమా పేరు: శ్రీ 420 (1955) ప్రేమ జంట: రాజ్‌కపూర్, నర్గిస్ స్వర సారథ్యం: శంకర్-జైకిషన్ సాహిత్యం: శైలేంద్ర గానం: లతా మంగేష్కర్, మన్నాడే ‘ప్యార్ హువా ఇక్రార్ హువా హై.. ప్యార్ సే ఫిర్ క్యోం డర్తా హై దిల్..’ భోరున వర్షం. తనివి తీరా తడవాలి. పక్కన ప్రేయసి ఉంది. అయినా ప్రియుడికి ఈ వాన చాలడం లేదు. ఎందుకంటే... ప్రేమ మొదలైంది. అంగీకారం కూడా దొరికింది. కానీ మనసులో ఏదో సంశయం. ప్రేమకు గమ్యం ముఖ్యమా? గమనం ముఖ్యమా ఏమో... ఈ పాట వింటుంటే మొత్తం సంశయాలన్నీ తొలగిపోయి, ఓ భరోసా దొరుకుతుంది. కావాలంటే వినండి. ****************** సినిమా పేరు: ఓ కౌన్ థీ (1964) ప్రేమ జంట: మనోజ్‌కుమార్, సాధన స్వర సారథ్యం: మదన్మోహన్ సాహిత్యం: రాజా మెహ్దీ అలీఖాన్ గానం: లతా మంగేష్కర్ లగ్ జా గలే.. ఫిర్ ఏ హసీన్... రాత్ హో నా హో... మునుపటి క్షణంతో మనకు పని లేదు. రేపటి క్షణం గురించి ఆలోచన అనవసరం. ఇవాళ్టి క్షణం విలువైనది. మనసు నిండా ప్రేమ నింపుకోవాలి. ఒంపుకోవాలి. తడిసి ముద్దవ్వాలి. మళ్లీ మళ్లీ... ఇలా ఆస్వాదిస్తూనే ఉండాలి. అస్సలు వృథా వద్దు. కాలాన్నీ... మౌనాన్నీ... పరిసరాల్ని ఏ మాత్రం పట్టించుకోవద్దు. ప్రేమకు ఈ క్షణమే శాశ్వతం నిజం! నిజంగా నిజం! ఒడిసిపట్టండి ఈ పాటను! *********************** సినిమా పేరు: సరస్వతిచంద్ర (1968) ప్రేమ జంట: మనీష్, నూతన్ స్వర సారథ్యం: కల్యాణ్‌జీ-ఆనంద్జీ సాహిత్యం: ఇందీవర్ గానం: లతా మంగేష్కర్, ముఖేష్ చందన్ సా బదన్.. చంచల్ చిట్వన్.. ధీరే సే తేర యే..’ పాట వెళ్లిపోయింది.. నువ్వూ వెళ్లిపోతావు. ఇంక నేనేం కావాలి? అవును కదూ! నీ జ్ఞాపకాలు ఇంకా మిగిలే ఉన్నాయిగా! చందనంతో పోత పోసినట్టుండే నీ దేహం మెరుపు... విల్లులా ఒంగిన కనుబొమ్మల్లోంచి దూసుకొచ్చే చూపుల రాపిడి... అమ్మో... నా వల్ల కాదు. నీ కన్నా నీ జ్ఞాపకాలు చేసే గాయమే అధికం. మనసుకు తియ్యటి యాతన కావాలనుకుంటేనే ఈ పాటను వినండి బాబూ! ********************** సినిమా పేరు: ఆరాధన (1969) ప్రేమ జంట: రాజేశ్ ఖన్నా, షర్మిలా ఠాగూర్ స్వర సారథ్యం: ఎస్.డి. బర్మన్ సాహిత్యం: ఆనంద్ బక్షి గానం: కిశోర్‌కుమార్ మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీ తు... కాలం ఘనీభవిస్తోంది.. మనసు ద్రవీభవిస్తోంది! నా కోసం ఎప్పుడు పాడతావు చెప్పు! నువ్వు నా కలల రాణివి. నీ కోసం ఎంత కాలమని ఎదురుచూడాలి. ఈ తోటలో పువ్వులు కూడా నీ గురించే ఆరా తీస్తున్నాయ్. నీ కోసమే ఈ అన్వేషణ.. ఈ నిరీక్షణ.. ఎప్పుడు వస్తావు చెప్పు! విరహాన్ని ఓ పాట రూపంలో అనుభవించాలని ఉందా...? అయితే వినండి ఈ పాట.. *********************** సినిమా పేరు: పాకీజా (1972) ప్రేమ జంట: రాజ్‌కుమార్, మీనాకుమారి స్వర సారథ్యం: గులామ్ మొహమ్మద్ సాహిత్యం: కమల్ అమ్రోహీ గానం: లతా మంగేష్కర్ ‘మౌసమ్ హై ఆషికానా... ఏ దిల్ కహీ సే..’ ఒంటరితనాన్ని భరించలేను. ఇదెంత నరకమో నీకేం తెలుసు. పగలు నాపై పగబట్టింది. చివరకు రాత్రి కూడా నన్ను బాధిస్తోంది. ఇక్కడ వెన్న లేదు.. వెన్నెలా లేదు.. మొత్తం చీకటే. నువ్వు రావాలి దివ్వెలాగా... ఆ కొంచెం వెలుతురు చాలు. నిజమే ఈ పాట తప్పకుండా వెలుతురునిస్తుంది. *********************** సినిమా పేరు: యాదోం కీ బారాత్ (1973) ప్రేమ జంట: ధర్మేంద్ర, జీనత్ అమన్ స్వర సారథ్యం: రాహుల్ దేవ్ బర్మన్ సాహిత్యం: మజ్రూ సుల్తాన్ గానం: మొహమ్మద్ రఫీ, ఆశా భోంస్లే చురా లియా హై తుమ్నే జో దిల్ కో...నజర్ నహీ చురానా సనమ్ ప్రేమంటే ఉప్పెన! తియ్యటి ఉప్పెన! కొట్టుకుపోవాల్సిందే! ఊపిరాడదు.. ఆకలేయదు.. దాహముండదు. నీ మీద నాకెంత ప్రేమ ఉందో ఎలా తేల్చాలి! దేంతో కొలవాలి! నా చూపుల భాష అర్థమైతే, నా హృదయంలోని గాఢత తెలిస్తే... ఈ ప్రశ్నలే ఉండవు. నిజమో కాదో.. ఈ పాట వింటూ తేల్చుకోవాలి. ********************** సినిమా పేరు: మైనే ప్యార్ కియా (1989) ప్రేమ జంట: సల్మాన్‌ఖాన్, భాగ్యశ్రీ స్వర సారథ్యం: రామ్-లక్ష్మణ్ సాహిత్యం: అసాద్ బోపల్లి గానం: లతా మంగేష్కర్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం దిల్ దీవానా బిన్ సజ్నా కే.. ఏ పగ్లా హై సమ్జానే సే.. ఇన్నాళ్లూ ఈ గుండె లబ్డబ్మనే కొట్టుకుంది. ఇప్పుడేమో శ్రుతి మార్చి లవ్ లవ్ అంటోంది. ఎందుకిదంతా? అసలేం జరిగింది? నువ్విటొచ్చాకే ఇదంతా జరిగింది కదూ! కానీ బావుంది. మళ్లీ మళ్లీ కావాలి. నీ ప్రేమతోనే ఈ గుండె నిండాలి. ఈ పాటతో కూడా...! ********************** సినిమా పేరు: 1942... ఎ లవ్‌స్టోరీ (1994) ప్రేమ జంట: అనిల్‌కపూర్, మనీషా కొయిరాలా స్వర సారథ్యం: ఆర్.డి. బర్మన్ సాహిత్యం: జావేద్ అక్తర్ గానం: కుమార్ సాను ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా.. జైసే ఖిల్తా గులాబ్... ఇప్పుడే ఒకమ్మాయిని చూశా.. అప్పుడే అరవిరిసిన గులాబీలా ఉంది. కవి ఊహల్లోంచి ఉరికొచ్చిన కవితా జలపాతంలా ఉంది. తళుక్కున మెరిసే ఉదయ రవికిరణంలా ఉంది. ఈ గులాబీ పరిమళాన్ని ఆస్వాదించాలి. ఈ జలపాతంలో తనివి తీరా తడిసి ముద్దవ్వాలి. ఈ కిరణపు నునువెచ్చని చెక్కిలిపై ఓ ముద్దు అవ్వాలి. ఈ పాట వింటూ ఆ అమ్మాయి మనసు వాకిట ముందు నిలిచి మెల్లిగా తలుపు తట్టండి. ************************** సినిమా పేరు: దిల్వాలే దుల్హనియా లేజాయేంగే(1995) ప్రేమ జంట: షారుక్ ఖాన్, కాజోల్ స్వర సారథ్యం: జతిన్-లలిత్ సాహిత్యం: ఆనంద్ బక్షి గానం: కుమార్ సాను, లతా మంగేష్కర్ తుజే దేఖా తో యే జానా సనమ్.. ప్యార్ హోతా హై దీవానా సనమ్ ప్రేమ అంటే ఏంటి? పిచ్చా? నువ్వు ఏదైనా అనుకో.. నాకు మాత్రం నువ్వు కావాలి. నీ నవ్వులకు ఈ దోసిలి చాలదనుకుంటే, మొత్తం మనసునే పరిచేస్తాను. ఒక్క కౌగిలి ఇవ్వు. సమస్తాన్నీ జయించేస్తాను. ఛా.. నిజమా! అనిపిస్తోందా? ప్రేమంటే పిచ్చి? కానీ ఈ పాట మాత్రం పిచ్చి కాదు.. ప్రేమే! -
‘పర్సూం’ కి కహానీ!
హిందీ సినిమాల్లో దక్కనీ మాండలికాన్ని కించపరుస్తూనే కాదు.. ప్రేమగా కూడా చాలా సందర్భాల్లో వాడారు. రేడియో, టీవీల్లో దిగువన ఉదహరించిన రెండు ప్రేమ గీతాలు చెవిన పడినపుడు ఒక ఫ్లాష్‌బ్యాక్ గుర్తొస్తుంది! ‘కల్ న మానా/ తూ పర్సోన మానా/ తూ బర్సోంసెన మాన...’ (నిన్నొప్పుకోలేదు/నీవు మొన్నొప్పుకోలేదు/ నీవు ఏళ్లు గడచినా ఒప్పుకోలేదు) ‘ఆజ్ కల్ పర్సూంకె బాతే నహీ తెరెమెరె సదియోంసె పెహ్చాన్ హై’ (ఈరోజు నిన్న మొన్న సంగతి కాదు/ మన పరిచయం యుగయుగాలది) హైద్రాబాద్‌కు వచ్చిన కొత్త. సమాచారం-ప్రచారశాఖ కమిషనర్‌గా ఉద్యోగం. ‘ఆంధ్రప్రదేశ్’గా ఏర్పడిన తొలి సంవత్సరాలు. హైద్రాబాద్ స్టేట్‌లో సమాచారశాఖ అంటూ ఒకటి ఉండేది కాదు. హైద్రాబాద్‌కు చెందిన రికార్డులు ? ఉర్దూ భాషలో దక్కనీ మాండలీకంలో సాంప్రదాయక పద్ధతుల్లో రాసినవి అక్కడొకటి ఇక్కడొకటి లభించేవి. అప్పటి ప్రముఖ సంపాదకులు దివంగత నార్ల వెంకటేశ్వరరావు తరచూ రికార్డులను స్ట్రీమ్‌లైన్ చేయాలని చెప్పేవారు. ఉర్దూ, ఇంగ్లిష్‌లలో డ్రాఫ్ట్ చేసే పరిజ్ఞానం ఉండడం వలన నా పై ఈ బాధ్యత మోపారు. పదము వినగ ప్రాణాలు కదలురా! ఈ క్రమంలో ఒక పదం నన్ను ముప్పుతిప్పలు పెట్టింది. రికార్డుల్లో ‘మొన్నటి వరదలు...(పర్సూం -కి-తుగ్యాని)’ అనే పదం తరచూ కన్పించేది. కొన్ని నెలలుగా ఇక్కడే ఉన్నాను కదా! హైద్రాబాద్‌లో మొన్న వరద ఎక్కడ వచ్చింది? అటువంటిదేమీ లేదు! దాదాపు సిటీలోని అన్ని ప్రాంతాల వారినీ అడిగే వాడిని. ‘లేదే’ అని సమాధానం! ఒక మిత్రుడి వివరణతో నా ఆందోళన దూది పింజలా విడిపోయింది! హిందీలో లేదా ఉర్దూలో ‘కల్-పర్సూం-తర్సూం-తీన్ దిన్ పహెలే- హఫ్తా కె పహెలె-మహినె కె పహెలె-పిచ్లే సాల్ (నిన్న - మొన్న - ఆ మొన్న- మూడు రోజుల క్రితం-వారం క్రితం-నెలక్రితం-ఏడాది క్రితం)’లాంటి పదాలు వ్యవహారంలో ఉన్నాయి. హైద్రాబాదీల వ్యావహారిక భాషలో అంత సంక్లిష్టత ఉండదు. ‘కల్-పర్సూం (నిన్న-మొన్న)’ అంతే! మొన్నటికి ముందంతా మొన్నే! ఇంతకీ రికార్డుల్లో ఉన్న ‘పర్సూం...’ ఏమిటనుకున్నారు? అమ్జద్ హైద్రాబాదీ కవన ఘోష! 1908 సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి 2 గంటల నుంచి (తెల్లవారితే 28) ఉదయం 6 గంటల వరకూ మేఘం బద్దలయ్యింది! ఉగ్రరూపం దాల్చిన మూసీ నది మూడోవంతు నగరాన్ని ముంచింది. 15 వేల మంది మరణించారు. వరదలో తల్లి సోఫియా బేగం, భార్య మెహబూబ్ ఉన్నీసా, కుమార్తె అజం ఉన్నీసాలు ‘అమ్జద్ హైద్రాబాదీ’ కళ్ల ఎదుటే మరణించారు. స్పృహతప్పిన 22 ఏళ్ల అమ్జద్ ఉస్మానియా ఆస్పత్రిలోని చింతచెట్టు తట్టుకున్నాడు. కొమ్మలకు వేలాడుతూ ప్రాణాలు నిలుపుకున్న 150 మందిలో అమ్జద్ ఒకడు! పార్సీ-ఉర్దూ-దక్కనీ ఉర్దూలలో ప్రముఖ కవిగా విఖ్యాతుడైన అమ్జద్ హైద్రాబాదీ కంటే గొప్పగా ఈ పెను విషాదాన్ని ఎవ్వరు వర్ణించగలరు? ఖయామత్-ఎ-సోగ్రా (మినార్లు మునిగిపోయాయి)లో ఒక చరణం... ఇత్ని దర్యా మే భీ న డూబా అమ్జద్/ ఇంతటి వరదలోనూ మునిగి పోలేదు అమ్జద్ డూబ్నై వాలోంకొ బస్ ఏక్ చుల్లూ కాఫీ హై /మునగని వాడికి చాలు ఒక ప్రాయశ్చిత్తం ఈ వరదల ఫలితంగా తర్వాత కాలంలో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యవంటి మేధావుల దార్శనికతతో దేశంలోనే ప్రణాళికాబద్ధమైన తొలి నగరంగా హైదరాబాద్ రూపొందింది! 1908 వరద తరచూ రికార్డుల్లోకి రావడం సహజం. అయితే అన్నింటా ‘మొన్నటి వరద...’గా! హైద్రాబాదీల సంభాషణల్లో ‘పర్సూం క్యా హువా మాలూం...’ తరచూ విన్పిస్తుంది! ‘మొన్నేమైందో తెలుసా..’ అంటే మొన్నటి నుంచి శతాబ్దాల క్రితం వరకూ! చరిత్ర చెత్తబుట్టను క్లీన్ చేయడానికి ఇంత కంటె మంచి పదం ఉందా?! -
ప్రేమ ఇష్క్ కాదల్