మూగబోయిన మనిషి తన మనసు లోతుల్లో పాడుకునేదే ఈ విరహగీతం. అలాంటి గీతాలే గాయపడిన మనసుకు రాసే మందవుతాయి. హృదయాన్ని చీకటి లోతుల్లోంచి రంగుల పచ్చిక బయళ్లలోకి తీసుకొస్తాయి. నిజ జీవితాలే కాదు కొన్ని సినిమా గీతాలు వాస్తవాలను మైమరపిస్తూ.. అనుభవాల గుర్తులతో గుండె నిట్టూర్పు విడిచేలా చేస్తాయి. ఎడబాటు పల్లవై.. కన్నీరు చరణమై.. మనసు పలికే మౌనరాగం. విరహగీతం