ప్రేమ..ఈ రెండక్షరాలు మనల్ని ఊహల్లో విహరించేలా చేస్తాయి. ప్రపంచాన్ని మరిచేలా చేస్తాయి. అందుకే ప్రేమకథాచిత్రాలు ఎన్ని వచ్చినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అందులోని ఎమోషన్స్ కొన్ని రోజుల దాకా మనతోనే ట్రావెల్ చేస్తాయి. ప్రేమకథల్లో ఏముంటాయి? అదొక సుత్తి అంటారు కొంతమంది. ఇంకొంతమందికి ప్రేమంటే అదొక పిచ్చి. లవ్ జానర్‌కు ప్రపంచమంతా ఫాలోయింగ్ ఉంది. ప్రేమకథలు తీస్తే..ఏ స్టార్‌డమ్ లేకున్నా దానికదే తెచ్చుకొని థియేటర్లలో వందల రోజులు ఆడేస్తుందని నమ్ముతారు ఫిల్మ్‌మేకర్స్. అందుకే లవ్ జానర్‌లో అనేక సినిమాలు వచ్చాయి..వస్తూనే ఉన్నాయి. కానీ దేనికదే ప్రత్యేకత. దేనిలో ఉండే ఎమోషన్స్ దానివే. అందుకే ప్రేమకు మనందరం అంతలా కనెక్ట్ అయిపోతాం. వాలైంటైన్స్ వీక్ సందర్భంగా ప్రేమకథాచిత్రాలను ఓసారి గుర్తుచేసుకుందాం.
తొలిప్రేమ
ప్రేమలోని అమాకయత్వం అంతా ఈ సినిమాలో ఉంటుంది. మొదటిసారి ప్రేమలో పడినప్పుడు ఎలా ఉంటుంది, ప్రేమించిన వ్యక్తిని చూడటానికి ఎంత ఆరాటపడతారు, ప్రేమను తెలియజేయడానికి ఎంత కష్టపడతారు లాంటి అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి.
ఆర్య
నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు..నా ప్రేమను ఫీల్ అవ్వు అంటూ ఆర్య అనే యువకుడు తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఆర్య ఒక కొత్తరకం ప్రేమ కథ. ఇలా కూడా ప్రేమ ఉంటుందా అన్నట్లుగా ఈ కథ నడుస్తుంది. చివరికి సుఖాంతమే అయినా, అంతవరకూ ఈ ప్రమకథలో చాలా గమ్మత్తైన మలుపులు ఉంటాయి.
నా ఆటోగ్రాఫ్..స్వీట్‌మెమురీస్
జీవితంలో మూడు దశల్లో తను ప్రేమించిన ముగ్గురు గుర్తుచేసుకుంటూ ఒక వ్యక్తిచేసే ప్రయాణమే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమురీస్. ప్రేమలోని అమాయకత్వం, స్వచ్చమైన ప్రేమ, బాధ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఇలాంటి కథతో మలయాళంలో ప్రేమమ్ సినిమా రూపొంది మంచి విజయం సాధించింది.
ఏ మాయ చేశావే
ఈ సినిమాలో ఎన్ని అలకలు ఉంటాయో,అంతే ప్రేమ ఉంటుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ సినిమాల్లో ‘ఏ మాయ చేశావేకి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే, నేను నిన్నే ఎందుకు ప్రేమించాలి? అని అడుగుతాడు హీరో. ప్రేమ కథల్లో ఉండే మ్యాజిక్ అంతా ఈ సినిమాలో ఉంటుంది.
100% లవ్
మనసునిండా ప్రేమ ఉన్నా ఇగోల కారణంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనుకునే క్యూట్ అండ్ రొమాంటిక్ బావా మరదళ్ల కథ ఇది. అన్నింట్లో తనే గ్రేట్ అని ఫీలయ్యే హీరోకి..తన టాలెంట్‌తో ధీటైన సమాధానం చెప్తుంది హీరోయిన్. ఇక అప్పట్నుంచి ఎవరికి వారు గ్రేట్ అని నిరూపించుకోవడం కోసం చేసే క్యూట్ టామ్ అండ్ జెర్రీ ఫైట్‌లా సాగుతుంది. ఎదుటివాళ్ల భావాలతో సంబంధం లేకుండా తన పంతమే నెగ్గాలనుకుంటాడు హీరో. చివరికి హీరో మరదలి ప్రేమతో మిస్టర్ పర్‌ఫెక్ట్‌లా మారతాడు.
నిన్నుకోరి
ప్రేమ పుట్టడానికి క్షణకాలం చాలు. కానీ అది పెళ్లిబంధంగా మారడానికి మధ్య చాలా పరిస్థితులు అడ్డంకులుగా మారతాయి. ఈ సినిమాలోనూ అదే జరుగుతుంది. ఇద్దరూ ప్రేమించుకున్నా కొన్ని కారణాల వల్ల పెళ్లిచేసుకోలేకపోతారు. అప్పటినుంచి తనకోసం అనునిత్యం తపన చెందుతుంటాడు హీరో నాని. ఈ క్రమంలో తన ప్రేయసి వాళ్లింటికి వెళతాడు. తను ప్రేమించిన అమ్మాయి వాళ్ల భర్తతో కలిసి సంతోషంగా ఉందని తెలుసుకున్నాక హీరో కూడా మారతాడు. తర్వాత తెలిసిన బంధువులమ్మాయితో హీరో పెళ్లి జరుగి కథ సుఖాంతమవుతుంది. చాలా మందికి ఈ కథ బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాలోని పాటలు కూడా మంచి విజయం సాధించాయి.
అర్జున్‌రెడ్డి
ప్రమలో ఎంత ప్రేమ ఉంటుందో, అంతే బాధ కూడా ఉంటుంది. ఆ బాధను చెప్పే సినిమా అర్జున్‌రెడ్డి. ప్రేమించిన అమ్మాయి అకస్మాత్తుగా దూరమైతే అర్జున్‌రెడ్డి అనే వ్యక్తి జీవితమంతా తలకిందులు అయిపోతుంది. కొన్నినెలలపాటు తనలో తానే ఒకనరకం అనుభవిస్తాడు. అతడి కథే ఈ సినిమా. ప్రేమకథల్లో మరో కొత్తకోణం ఈ సినిమా.
దొరసాని
స్వచ్ఛమైన ప్రేమకు కులాలు,అంతస్తులు అడ్డురావని ఓ దొరసాని పేదింటి అబ్బాయిని ప్రేమిస్తే ...అందుకు ఒప్పుకోని దొరసాని కుటుంబసభ్యలు వారిని ఏం చేశారుట? . వారి ప్రాణం పోతుందని తెలిసినా ప్రేమ కోసం వారు చేసిన పోరాటం ఏంటి అన్నదే ఈ సినిమా కథ.ఈలాంటి జానర్‌లో ఇదివరకే సినిమాలు వచ్చినా దేనికదే ప్రత్యేకం. తెలంగాఫ గడీల నేపథ్యంలో ఓ ఊరి దొరసానికి ,పేదింటి అబ్బయికి మధ్య సాగిన ప్రేమకథకు తెలంగాణ యాసను జోడించి తీసిన స్వచ్ఛమైన ప్రేమకథ. కమర్షియల్‌గా కాకుండా అందంగా తీర్చిదిద్దిన రియల్‌స్టోరి ఇది.
డియర్ కామ్రేడ్
విప్లవ భావాలున్న ఓ వ్యక్తి ప్రేమలో పడటం, ఆ తర్వాత తన భావాలకు,ప్రేమకు మధ్య జరిగే సంఘర్షణ, వాటి వల్ల ఎదురైన పరిస్థితులు, మహిళా క్రికెట్ అసోసియేషన్‌లో వేదింపుల నేపథ్యంలో సాగుతుంది ఈ సినిమా.
జాను
తమిళంలో క్లాసిక్ హిట్‌గా నిలిచిన 96 సినిమాకి రీమేక్ ఈ సినిమా. వృత్తిపరంగా ట్రావెల్ ఫోటోగ్రాఫరైన రామ్..అనుకోకుండా తను చదువుకున్న స్కూల్‌కి వెళతాడు. స్కూల్‌ని చూసి పాత ఙ్ఞాపకాల్ని నెమరేసుకుంటాడు. రామ్, జాను పదో తరగతిలో ప్రేమలో పడతారు. కానీ అనుకోకుండా విడిపోతారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్‌లో కలుసుకున్న వాళ్లిద్దరూ తమ తొలిప్రేమ గురించి ఏం మాట్లాడుకున్నారు? అన్ని సంవత్సరాల తర్వాత వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పులు ఏంటి అన్నదే ‘జాను’ కథ. ప్రతీ ఒక్కరి జీవితంలో ఫస్ట్‌లవ్ చాలా స్పెషల్. అలా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఈ సినిమా.
Comments
Please login to add a commentAdd a comment